అమెరికా: కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్‌లో భారత సంతతి మహిళ

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచంలోని 66 దేశాలకు విస్తరించింది.శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్న అగ్రరాజ్యం అమెరికాను సైతం కోవిడ్-19 వణికిస్తోంది.వైరస్ కారణంగా ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.90 మంది దీని బారినపడి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు.వైరస్‌ను స్వయంగా పర్యవేక్షించడంతో పాటు ఎదుర్కొనేందుకు గాను జనవరి 30న వైట్‌హౌస్‌లో కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

 Indian American Seema Verma Appointed Key Member Of Us Coronavirus Task Force-TeluguStop.com

తాజాగా ఇందులో భారతీయ అమెరికన్ సీమా వర్మకు ట్రంప్ చోటు కల్పించారు.

అమెరికా ఆరోగ్య మరియు మానవ సేవల కార్యదర్శి అలెక్స్ అజార్ నేతృత్వంలో ఈ టాస్క్‌ఫోర్స్ జాతీయ భద్రతా మండలి ద్వారా సమన్వయం చేయబడుతుంది.

సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేడ్ సర్వీసెస్ (సీఎంఎస్స) అడ్మినిస్ట్రేటర్ సీమా వర్మ, వెటరన్స్ వ్యవహారాల కార్యదర్శి రాబర్ట్ విల్కీ ఇద్దరినీ కరోనా టాస్క్‌ఫోర్స్‌లో నియమించినట్లు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ట్వీట్ చేశారు.

Telugu Coronavirus, Coronavirustask, Indian American, Indianamerican, Key Member

మరోవైపు కరోనా టాస్క్‌ఫోర్స్‌లో తనను నియమించడం పట్ల సీమా వర్మ స్పందించారు.అమెరికా ప్రజలకు సేవ చేయడానికి, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో అవసరమైన భద్రతా ప్రమాణాలను అమలు చేస్తానన్నారు.కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు రోగుల సంరక్షణపై దృష్టి సారిస్తానని సీమా ట్వీట్ చేశారు.

అదే సమయంలో తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Telugu Coronavirus, Coronavirustask, Indian American, Indianamerican, Key Member

అమెరికన్ల ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సు కోసం వైట్ హౌస్ కరోనా టాస్క్‌ఫోర్స్ ప్రతిరోజూ పనిచేస్తుందని పెన్స్ తెలిపారు.యూఎస్ సంభవించిన ఆరు కరోనా మరణాలు వాషింగ్టన్ రాష్ట్రానికి చెందినవేనన్నారు.దేశంలో 91 మందికి వైరస్ సోకగా.

వీరిలో 43 మందికి అమెరికాలో, మిగిలిన 48 మందికి విదేశాల నుంచి వచ్చిన తర్వాత వైరస్ లక్షణాలు కనిపించాయని పెన్స్ వెల్లడించారు.వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి కరోనాకు చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, అయితే వ్యాక్సిన్ కోసం మాత్రం ఏడాది చివరి వరకు వేచి చూడాల్సిందేనని పెన్స్ స్పష్టం చేశారు.

మరోవైపు అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి పెన్స్ సోమవారం వైట్ హౌస్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్‌ కోసం పనిచేస్తున్న ఫార్మా ప్రముఖులతో సమీక్ష నిర్వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube