అమెరికా: కార్మిక శాఖ సొలిసిటర్ జనరల్‌గా భారత సంతతి మహిళ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనా యంత్రాంగంలో భారతీయులు కీలక పదవులు దక్కించుకుంటూనే వున్నారు.తాజాగా మరో భారత సంతతి మహిళకు అత్యున్నత పదవి దక్కింది.

 Indian-american Seema Nanda Is New Solicitor For Us Labour Department, Joe Biden-TeluguStop.com

భారతీయ అమెరికన్ పౌర హక్కుల న్యాయవాది సీమా నందాను అమెరికా కార్మిక శాఖ కొత్త సొలిసిటర్‌గా యూఎస్ సెనేట్ ధృవీకరించింది.ఈ పదవికి సీమాను కొద్దిరోజుల క్రితం అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు.

తాజాగా ఈ నామినేషన్‌ను ధృవీకరించేందుకు బుధవారం సెనేట్ సమావేశం అయింది.ఈ క్రమంలో 53-46 ఓట్ల తేడాతో సీమా కార్మిక శాఖ కొత్త సొలిసిటర్‌గా ఎన్నికయ్యారు.48 ఏళ్ల సీమా నందా. ఒబామా-బైడెన్ హయాంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, కార్మిక శాఖ డిప్యూటీ సొలిసిటర్‌గా పని చేశారు.

అలాగే ఆమెకు లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ అటార్నీగా 15 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.ప్రభుత్వ శాఖలలో పలు హోదాల్లో సీమా నందా విధులు నిర్వహించారు.అలాగే ఆమె డెమొక్రటిక్ నేషనల్ కమిటీకి సీఈఓగానూ వ్యవహరించారు.కనెక్టికట్‌లో పెరిగిన సీమా.

బ్రౌన్ యూనివర్సిటీ అండ్ బోస్టన్ కాలేజీ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు.

కార్మిక శాఖ సొలిసిటర్ జనరల్‌గా సీమా నంద నియామకానికి సెనేట్ ఆమోద్ర ముద్ర వేయడంపై కాంగ్రెస్ ఆసియా పసిఫిక్ అమెరికన్ కాకస్ చైర్ జూడీ చూ హర్షం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్, వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల యజమానులతో పాటు కార్మికులు ప్రతిరోజూ కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని జూడీ అన్నారు.ఇలాంటి పరిస్ధితుల్లో జో బైడెన్‌కు నందా అనుభవం ఉపయోగపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Telugu Civil, Atul Gawande, Staff, Deputy Staff, Deputy Labor, Indianamerican, J

కాగా, జో బైడెన్ ఇటీవల తన పాలనా యంత్రాంగంలోకి మరో 11 మందిని తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.వీరిలో ఇద్దరు ఇండో అమెరికన్లకు కూడా స్థానం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.భారతీయ అమెరికన్లు రాహుల్ గుప్తా, అతుల్ గవాండే ఆ లిస్ట్‌లో ఉన్నారు.రాహుల్‌ గుప్తాను నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ డైరక్టర్‌గా, అతుల్ గవాండేను బ్యూరో ఫర్ గ్లోబల్ హెల్త్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube