అమెరికా వ్యవసాయ పరిశోధనా సంస్థకు తాత్కాలిక చీఫ్‌గా ఇండో అమెరికన్ శాస్త్రవేత్త  

Prominent Indian-American scientist appointed acting head of top US agriculture research organisation, US agriculture research organisation,Parag Chitnis - Telugu Parag Chitnis, Prominent Indian-american Scientist Appointed Acting Head Of Top Us Agriculture Research Organisation, Us Agriculture Research Organisation

అమెరికాలో భారత సంతతి శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం లభించింది.ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఎన్ఐఎఫ్ఏ) యాక్టింగ్ డైరెక్టర్‌గా ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ పరాగ్ చిట్నిస్ నియమితులయ్యారు.

 Indian American Scientist Parag Chitnis

ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో ఆయనను ప్రోగ్రామ్స్‌కు అసోసియేట్ డైరెక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

ఎన్ఐఎఫ్ఏలోని సుమారు 1.7 బిలియన్ డాలర్ల విలువైన రీసెర్చ్ ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన వ్యవహారాలను పరాగ్ పర్యవేక్షిస్తారు.ఆయన నియామకంపై యూఎస్ వ్యవసాయ కార్యదర్శి సోని పెర్డ్యూ మాట్లాడుతూ.

అమెరికా వ్యవసాయ పరిశోధనా సంస్థకు తాత్కాలిక చీఫ్‌గా ఇండో అమెరికన్ శాస్త్రవేత్త-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఎన్ఐఎఫ్ఏ యాక్టింగ్ డైరెక్టర్‌గా డాక్టర్ చిట్నిస్ తన 31 సంవత్సరాల శాస్త్రీయ పరిశోధనా అనుభవంతో యంత్రాంగాన్ని నడిపిస్తారని ఆకాంక్షించారు.ప్రస్తుతం గైనెస్విల్లెలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో వ్యవసాయ మరియు సహజ వనరుల ఉపాధ్యక్షుడిగా పరాగ్ వ్యవహరిస్తున్నారు.

డాక్టర్ చిట్నిస్ మహారాష్ట్రలోని కొంకణ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి బోటని/ మొక్కల పెంపకంలో బీఎస్సీ.న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ నుంచి జెనెటిక్స్/ బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీ పట్టా పొందారు.

లాస్‌ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాయం నుంచి జీవశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు.

#Parag Chitnis

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian American Scientist Parag Chitnis Related Telugu News,Photos/Pics,Images..