భారత సంతతి యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నాకు కీలక పదవి..!!

Indian-American Ro Khanna Elected Co-chair Of US House India Caucus , US House, Ro Khanna, Indian-American, Mike Waltz, Amy Bera, Ro Khanna, Raja Krishnamurthy, Pramila Jayapal, Sri Thanedar, IIT Bombay, University Of Michigan

డెమొక్రాటిక్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా, మరో నేత మైక్ వాల్ట్‌జ్ ‘‘భారత్, భారతీయ అమెరికన్లకు సంబంధించి కాంగ్రెషనల్ కాకస్’’కు కో చైర్‌లుగా ఎంపికయ్యారు.ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి వున్న ప్రతినిధుల సభలో ఇండియా కాకస్ అతిపెద్ద ద్వైపాక్షిక కూటమి.46 ఏళ్ల రో ఖన్నా.1993లో ‘‘భారత్, భారతీయ అమెరికన్లకు సంబంధించి కాంగ్రెషనల్ కాకస్’’ స్థాపించబడినప్పటి నుంచి దీనికి కో చైర్‌గా ఎన్నికైన రెండవ భారత సంతతి వ్యక్తి.గతంలో కాంగ్రెస్ సభ్యుడు అమీబెరా దీనికి 2015-16 మధ్య కాలంలో కో చైర్‌గా పనిచేశారు.ఆ సమయంలో యూఎస్ కాంగ్రెస్‌లో పనిచేస్తున్న ఏకైక భారతీయ అమెరికన్ అమీబెరానే.

 Indian-american Ro Khanna Elected Co-chair Of Us House India Caucus , Us House,-TeluguStop.com

ఇప్పుడు కాంగ్రెస్‌లో భారతీయుల సంఖ్య 5కు (అమీ బెరా, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్, శ్రీ తానేదార్) పెరిగింది.

Telugu Amy Bera, Iit Bombay, Indian American, Mike Waltz, Pramila Jayapal, Ro Kh

తాను ఇండియాక కాకస్‌ అధ్యక్షత వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు రో ఖన్నా అన్నారు.యూఎస్ ఇండియా సంబంధాలు బలోపేతం చేయడంలో భారతీయ అమెరికన్ డయాస్పోరా సైతం పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.రో ఖన్నా .కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.గతేడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఆయన వరుసగా నాలుగోసారి కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు.

Telugu Amy Bera, Iit Bombay, Indian American, Mike Waltz, Pramila Jayapal, Ro Kh

పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన హిందూ కుటుంబంలో జన్మించారు రో ఖన్నా.ఆయన తండ్రి ఐఐటీ బాంబే, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో చదువుకోగా, తల్లి స్కూల్ టీచర్‌గా పనిచేశారు.ఖన్నా తల్లి తరపు తాతగారు అమర్‌నాథ్ విద్యాలంకార్‌ భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.లాలాలజ్‌పత్ రాయ్‌తో కలిసి ఉద్యమాలు చేసి జైలు శిక్ష కూడా అనుభవించారు.ఇక రో ఖన్నా యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి ఆర్ట్స్, ఎకనామిక్స్, హానర్స్‌లో డిగ్రీ చేశారు.డెమొక్రాటిక్ పార్టీకి గట్టి మద్ధతుదారైన రో ఖన్నాను 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా నియమించారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube