డెమొక్రాట్ల కంచుకోటలో రిపబ్లికన్లు: న్యూజెర్సీ సెనేట్‌ ప్రైమరీలో ఇండో అమెరికన్ విజయం  

In A First, New Jersey Republicans Nominate Indian-American Rik Mehta For Senate Seat, Indian-American Rik Mehta , New Jersey Republicans - Telugu In A First, Indian-american Rik Mehta, New Jersey Republicans, New Jersey Republicans Nominate Indian-american Rik Mehta For Senate Seat

భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త రిక్ మెహతా అమెరికా రాష్ట్రమైన న్యూజెర్సీ సెనేట్ స్థానానికి జరిగిన ప్రైమరీలో విజయం సాధించారు.తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇండో అమెరికన్‌గా గుర్తింపు పొందారు.

 Indian American Rik Mehta For Senate Seat

యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారిగా పనిచేసిన రిక్ మెహతా.రిపబ్లికన్ పార్టీలో తన సమీప ప్రత్యర్థి, మరో ఇండియన్ అమెరికన్ హిర్ష్ సింగ్‌ను ఓడించారు.

జూలై 7న జరిగిన ప్రైమరీల ప్రాథమిక ఫలితాల ప్రకారం మెహతాకు 13,743 ఓట్ల మెజారిటీ లభించింది.షెడ్యూల్ ప్రకారం ముందుగానే ఈ ఫలితాలు రావాల్సి వున్నప్పటికీ… మెయిల్ ఇన్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కారణంగా ఎన్నికల ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం జరిగింది.

డెమొక్రాట్ల కంచుకోటలో రిపబ్లికన్లు: న్యూజెర్సీ సెనేట్‌ ప్రైమరీలో ఇండో అమెరికన్ విజయం-Telugu NRI-Telugu Tollywood Photo Image

ప్రైమరీలలో విజయం ద్వారా నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత డెమొక్రటిక్ సెనేటర్ కోరి బుకర్‌తో మెహతా తలపడనున్నారు.న్యూజెర్సీ సెనేటోరియల్‌ రేసులో రెండు పార్టీల నుంచి అభ్యర్థులు ఉండటం ఇదే మొదటిసారి.ఆఫ్రికన్- అమెరికన్ అయిన కోరి బుకర్.89 శాతం ఓట్లతో డెమొక్రటిక్ ప్రైమరీని గెలుచుకున్నారు.

భారతీయ అమెరికన్ల జనాభా ఎక్కువగా ఉండే న్యూజెర్సీని డెమొక్రటిక్ పార్టీకి కంచుకోటగా పరిగణిస్తారు.48 ఏళ్లుగా ఈ పార్టీకి చెందిన వ్యక్తులే సెనేటర్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న నేపథ్యంలో మొదటిసారిగా రిపబ్లికన్లను ఎన్నుకున్నారు.రాష్ట్రంలోని రెండు సెనేట్ సీట్లు ప్రస్తుతం డెమొక్రాట్ల చేతిలోనే ఉన్నాయి.సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ర్యాంకింగ్ సభ్యుడు రాబర్ట్ మెనెండెజ్ వీరిలో ఒకరు కాగా, మరోకరు కోరి బుకర్.

రట్జర్స్ విశ్వవిద్యాలయం నుంచి రిక్ మెహతా ఫార్మసీలో బీఎస్… అర్కాన్సాస్ విశ్వవిద్యాలయం నుంచి మెడికల్ సైన్సెస్‌లో డీఫార్మసీ పట్టా పొందారు.

#In A First

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian American Rik Mehta For Senate Seat Related Telugu News,Photos/Pics,Images..