అమెరికాలో భారత సంతతి మహిళా విద్యావేత్తకు అరుదైన గౌరవం

అమెరికాలోని పలు రంగాల్లో భారతీయులు దూసుకెళ్తున్నారు.స్థానిక అమెరికన్లకు సైతం పోటీ ఇస్తూ తమదైన ముద్ర వేస్తున్నారు.

 Indian-american Woman Elected To American Academy Of Arts And Sciences,renu Khat-TeluguStop.com

తాజాగా ప్రతిష్టాత్మక హ్యూస్టన్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా ఉన్న భారత సంతతికి చెందిన రేణు ఖాటోర్‌ చరిత్ర సృష్టించారు.ప్రఖ్యాత అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఏఏఏఎస్)కు ఎన్నికయ్యారు.

పలు దశాబ్ధాలుగా విద్యారంగంలో ఆమె అందిస్తున్న సేవలకు గానూ రేణుకు ఈ గౌరవం దక్కింది.వివిధ రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తుల సేవలను ప్రజలకు చేరువచేసే లక్ష్యంతో ఏఏఏఎస్‌ని 1780లో స్థాపించారు.
2020లో ఆమెతో పాటు వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, స్కాలర్లు, కళాకారులు, రాజకీయ నేతలు ఉన్నారు.ఇక రేణు వ్యక్తిగత విషయాలకి వస్తే.

ఉత్తరప్రదేశ్‌‌లో 1958లో జన్మించిన ఆమె 1973లో కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి లిబరల్ ఆర్ట్స్ బ్యాచిలర్ డిగ్రీని పొందారు.అనంతరం అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని అందుకున్నారు.

అనంతరం యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ సిస్టమ్ ఛాన్సలర్‌గా, వర్సిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు.ఆ యూనివర్సిటీ ఛాన్సలర్‌గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ రేణుయే.

అలాగే ఇంతటి ప్రఖ్యాత వర్సిటీకి ఛాన్స్‌లర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా ఆమె రికార్డుల్లోకి ఎక్కారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube