అమెరికా : బ్రౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్‌గా భారత సంతతి మహిళ

అమెరికాలోని ప్రఖ్యాత బ్రౌన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు డీన్‌గా భారతీయ అమెరికన్ ప్రొఫెసర్ తేజల్ దేశాయ్ ఎంపికయ్యారు.ప్రస్తుత డీన్‌‌గా వ్యవహరిస్తోన్న లారెన్స్ లార్సన్ పదవీ విరమణ అనంతరం.

 Indian American Professor Named Dean Of Brown University School Of Engineering,-TeluguStop.com

ఈ ఏడాది సెప్టంబర్ 1 నుంచి ప్రొ.దేశాయ్ బాధ్యతలు చేపడతారు.

ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న డా.తేజల్ దేశాయ్.బ్రౌన్ యూనివర్శిటీ నుంచి బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో బీఎస్‌సీ డిగ్రీ పొందారు.వివిధ యూనివర్శిటీల అకడమిక్, పరిశోధన కార్యక్రమాలకు దేశాయ్ నేతృత్వం వహించారు.ఈ నియామకంతో దేశాయ్.స్టెమ్ (STEM) రంగాలుగా పేరున్న సైన్స్, టెక్, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్ శాస్త్ర విభాగాల్లో రాణిస్తున్న భారత సంతతి నిపుణుల జాబితాలో చోటు సంపాదించారు.

మానవ శరీరంలోని టార్గెటెడ్ సైట్‌లకు ఔషధాన్ని అందించేందుకు కొత్త మార్గాలను రూపొందించేందుకు గాను డాక్టర్ దేశాయ్.మైక్రో, నానో స్కేల్ టెక్నాలజీలపై పరిశోధన చేస్తున్నారు.

కాలిఫోర్నియా యూనివర్సిటీ బయో ఇంజనీరింగ్, థెరప్యూటిక్ సైన్సెస్ విభాగానికి ఆమె గతంలో చైర్‌గా వ్యవహారించారు.చికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్, బోస్టన్ విశ్వవిద్యాలయాల్లో అకడమిక్ లీడర్‌షిప్ స్థానంలోనూ ఆమె సేవలందించారు.బ్రౌన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అడ్వైజరీ బోర్డులోనూ దేశాయ్ సభ్యురాలిగా పనిచేశారు.1972లో కాలిఫోర్నియాలోని హంటింగ్‌టన్ బీచ్‌లో తేజల్ దేశాయ్ జన్మించారు.శాంటా బార్బరాలో ఎక్కువ కాలం గడిపిన ఆమెకు ముగ్గురు పిల్లలు.

ఇకపోతే గత నెలలో ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీలి బెండపూడి ఎన్నికైన సంగతి తెలిసిందే.

అంతేకాదు ఈ వర్సిటీకి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.వచ్చే ఏడాదిలో పెన్ స్టేట్ 19వ ప్రెసిడెంట్‌గా నీలి బాధ్యతలు స్వీకరించనున్నారు.ఇప్పటి వరకు ఈ పదవిలో ఎరిక్ జె బారన్ బాధ్యతలు నిర్వర్తించారు.ఆయన పెన్ స్టేట్‌కు దాదాపు 30 ఏళ్లకు పైగా సేవలందించారు.

Telugu Tejal Desai, Brown School, Neeli Bendapudi, Professortejal, Tejaldesai-Te

నీలి బెండపూడి విశాఖపట్నంలో జన్మించి, ఉన్నత చదువుల కోసం 1986లో అమెరికాకు వెళ్లారు.ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఎంబీఏని పూర్తి చేశారు.అనంతరం కాన్సాస్ యూనివర్సీటి నుంచి మార్కెటింగ్‌లో డాక్టరేట్‌ను పొందారు.డాక్టర్ వెంకట్ బెండపూడిని నీలి పెళ్లాడారు.ఆయన ఒహియో స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌, యూనివర్సిటీ ఆఫ్ లూయిస్‌విల్లేలో అధ్యాపకుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు.

ప్రస్తుతం నీలి బెండపూడి.

కెంటకీలోని లూయిస్‌విల్లే విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గానూ, ప్రెసిడెంట్‌గానూ విధులు నిర్వర్తిస్తున్నారు.కాన్సాస్ విశ్వవిద్యాలయంలో అత్యున్నత అధికారిగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్‌గా, యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌లో స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌గా, ఓహియో స్టేట్ యూనివర్శిటీలో ఇనిషియేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ ఫౌండింగ్ డైరెక్టర్‌గానూ ఆమె సేవలందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube