అమెరికాలో అత్యున్నత పదవికి ఎంపికైన భారతీయురాలు..!!

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధికారం చేపట్టిన తరువాత వడివడిగా నిర్ణయాలు తీసుకుంటూనే, తన పరిపాలన విభాగంలో నిష్ణాతులైన వ్యక్తులను ఏరి కోరి మరీ నియమించుకుంటున్నారు.అమెరికా ఆర్ధిక పరిస్థితి మళ్ళీ మెరుగుపడేలా చేస్తూనే ప్రపంచ దేశాల ముందు అమెరికాను తిరుగులేని శక్తిగా నిలబెడుతానని బిడెన్ హామీ ఇచ్చారు.

 Indian-origin Pramila Jayapal  Eelcted Vice Chair Of A Key Congressional Subcomm-TeluguStop.com

ఇందులో భాగంగానే అత్యంత శక్తివంతమైన టీమ్ తో పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నారు బిడెన్.ఇదిలాఉంటే


బిడెన్ ఎంపిక చేసుకున్న టీమ్ లో ఇప్పటికే పలువురు ప్రవాస భారతీయులకు కీలక పదవులు అప్పగించిన విషయం విధితమే అయితే తాజాగా బిడెన్ భారత సంతతి మహిళా, బిడెన్ కు నమ్మకస్తురాలిగా ఉన్న అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ కు అత్యంత కీలకపదవిని అప్పగించారు.

అమెరికా యాంటీట్రస్ట్ కమర్షియల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లా సబ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా ప్రీలా జయ్ పాల్ ను నియమిస్తూ బిడెన్ ఉత్తరువులు జారీ చేశారు.


భారత్ లోని తమిళ నాడులో జన్మించిన ప్రమీలా జయపాల్ జర్నలిజం లో స్వేఛ్చ కోసం ఎంతో పోరాడారు అమెరికా ప్రతినిధుల సభలో ఉన్న మొట్ట మొదటి భారత సంతతి మహిళ నేత మన జయపాల్ కావడం భారతీయులు గర్వించదగ్గ విషయం.

ఇమ్మిగ్రేషన్ విధానాలలో మార్పులకోసం అలాగే, వివిధ రంగాలలో ఆధిపత్య ధోరణిపై ఆమె వ్యతిరేక నినాదం వినిపించారు.ఐటీ రంగంలో మార్పులు , కొత్త ఆవిష్కరణలు వచ్చే విధంగా ప్రమీలా జయపాల్ తీవ్రంగా కృషి చేశారు.

హేట్ ఫ్రీ జోన్ అనే సంస్థను ప్రారంభించి అమెరికాలో ఆసియా సంతతికి చెందిన వారికి ఎన్నో సేవలు అందించారు.తనకు అత్యున్నత పదవి రావడంపై ప్రమీల సంతోషం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube