అమెరికాలో భారీగా పెరుగుతున్న భారతీయుల సంఖ్య

అమెరికా అంటే ఎంతో మంది విదేశీయులతో కూడిన వలస దేశం.అమెరికా ప్రపంచంలో అగ్ర దేశంగా, పెద్దన్నగా ఎదిగిందంటే డానికి ప్రధానమైన కారణం ఒక్కటే నైపుణ్యం ఉన్న విదేశీయులని అక్కున చేర్చుకోవడం.

 Indian American Population Grew By 49 Percent-TeluguStop.com

ఎంతో మంది ప్రతిభావంతులైన, వివిధ రంగాలలోని నిష్ణాతులైన భారతీయులు అమెరికాకి వెళ్ళడం అక్కడే స్థిరపడటం, వారి పిల్లలు ఇలా అమెరికా వ్యాప్తంగా వివిధ దేశాలకి చెందినా వారు అమెరికాలోనే స్థిరపడిపోయారు.

ఈ కోవలోనే సర్వే చేపట్టిన థింక్ ట్యాంక్ ది సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ ఓ సర్వే చేపట్టింది.

వారి సర్వే వివారాల ప్రకారం చూస్తే.గడిచిన 9 ఏళ్ళలో భారతీయుల సంఖ్య అమెరికాలో దాదాపు 49 శాతం పెరిగిందని అంటే 9 లక్షల మంది భారతీయులు అమెరికాలో పెరిగారని సంస్థ తెలిపింది.అంతేకాదు అమెరికాలో జనాభా 32.7 కోట్లు ఉంటే వారిలో 4.47 కోట్ల మంది విదేశీయులేనని సర్వే తెలిపింది.

అమెరికాలో భారీగా పెరుగుతున్న

అంటే అమెరికా జానాభాలో సుమారు 13.7 శాతం మంది విదేశీయులేనని తేల్చి చెప్పింది.2010 లో 4 కోట్ల మంది విదేశీయులు ఉంటే ప్రస్తుతం వారి శాతం 11.8 కి పెరిగిందని సంస్థ తెలిపింది.2010 లో భారతీయుల జనాభా 18 లక్షలు ఉండగా 2018 లో ఈ జనాభా 27 లక్షలకి పెరిగింది.అదే 1990 నుంచీ చూస్తే మొత్తం భారతీయుల జనాభా 500 శాతం పెరిగిందని సర్వే ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube