అమెరికా : అరెస్ట్ చేయడానికి వచ్చాడని, భారత సంతతి పోలీస్ అధికారిపై కాల్పులు.. పరిస్థితి విషమం

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది.ఓ కేసు విషయంగా అరెస్ట్ చేసేందుకు వెళ్లిన భారత సంతతి పోలీస్ అధికారిపై దుండగుడు కాల్పులు జరిపాడు.

 Indian-american Police Officer Wounded In Shooting , Paranhans Desai, County She-TeluguStop.com

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఆయన పరిస్ధితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.పరంహాన్స్ దేశాయ్ (38) అనే ఇండో అమెరికన్ పోలీస్ అధికారి నవంబర్ 4 సాయంత్రం జార్జియా రాష్ట్రంలోని మెక్‌డొనాఫ్‌లోని ఒక ఇంటిలో ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేయడానికి వచ్చారు.

అయితే దుండగుడు ఆయనపై కాల్పులు జరిపినట్లు స్థానిక కౌంటీ షెరీఫ్ రిజినాల్డ్ స్కాండ్రెట్ మీడియాకు తెలిపారు.దాడి చేసిన వ్యక్తి పారిపోయే క్రమంలో దేశాయ్‌పై కాల్పులు జరిపినట్లు స్కాండ్రెట్ చెప్పారు.

పట్టణానికి చెందిన లెజెండరీ బాస్కెట్‌బాల్ ప్లేయర్ షాకిల్ నీ ఓల్ .దేశాయ్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్షించిన వారికి 5,000 డాలర్ల రివార్డ్ ప్రకటించాడు.దీనికి అదనంగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు సైతం 25,000 డాలర్ల రివార్డ్‌లను అందిస్తామని ప్రకటించాయి.దాడి చేసిన వ్యక్తిని జోర్డాన్ జాక్సన్‌గా పోలీసులు గుర్తించారు.దుండగుడు ఎక్కడ వున్నా నేను నిన్ను అరెస్ట్ చేస్తానని కౌంటీ షెరీఫ్ స్కాండ్రెట్‌ హెచ్చరించారు.అట్లాంటాలో 17 ఏళ్లుగా దేశాయ్ విధులను నిర్వర్తిస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది.

జార్జియా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్స్, డెకాల్బ్ కౌంటీ పోలీస్‌లో గతేడాది పనిచేశాడని తెలిపారు.దేశాయ్‌కి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారని చెప్పారు.

కాగా, మిన్నెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే ఓ నల్ల జాతి వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస్తుండగా చనిపోయిన సంగతి తెలిసిందే.2020 మే 25న జరిగిన ఈ ఘటన కారణంగా అమెరికాలోని అనేక నగరాలు రగిలిపోయాయి.ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెడపై గట్టిగా నొక్కిపట్టడంతో అతని ఊపిరాడక మరణించాడు.తనకు ఊపిరాడటం లేదని ఫ్లాయిడ్‌ అరుస్తున్నా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించినట్లు వైరల్ అయిన వీడియోలలో ఉంది.

ఈ క్రమంలో జార్జ్‌ఫ్లాయిడ్ ఆక్సిజన్ అందకే మరణించాడని వైద్యుడు తెలిపారు.వివాదాస్పద పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ మోకాలు అతని మెడపై ఉండటం వల్ల అతను ఊపిరి ఆడక ప్రాణాలు వదిలాడని డాక్టర్ వాంగ్మూలం ఇచ్చారు.దీంతో చౌవిన్‌కు 22.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

Telugu Countysheriff, Decolb County, Indianamerican, Jordan Jackson, Paranhans D

బ్లాక్ లైవ్ మూవ్‌మెంట్ తారాస్థాయికి చేరడంతో పోలీస్ శాఖను రద్దు చేసి.దాని స్థానంలో ‘‘పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్’’ని ఏర్పాటు చేయాలని మిన్నియాపొలిస్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ విఫలమైన సంగతి తెలిసిందే.గతేడాది దేశవ్యాప్తంగా హింసాత్మక నేరాలు అనూహ్యంగా పెరిగాయి.

హత్యలు 29 శాతం పెరిగి 27,570కి చేరుకున్నాయి.పోలీసులు సైతం కొన్ని నెలలుగా సంయమనం పాటిస్తున్నారు.

అందుకు తగ్గకుండా దేశాయ్‌పై కాల్పులు జరిగినప్పుడు కూడా పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్లు ఎక్కడా సమాచారం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube