కరోనాపై పోరు.. మీరు నిజమైన హీరోలు: ఇండో అమెరికన్ వైద్యులపై భారత రాయబారి ప్రశంసలు

కరోనా మహమ్మారిపై పోరులో ఇండో అమెరికన్ వైద్యులు నిజమైన హీరోలు అని ప్రశంసించారు అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ.అట్లాంటాలో జరిగిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఏఏపీఐ) 39వ వార్షిక సదస్సులో సంధూ పాల్గొన్నారు.

 Indian-american Physicians Are Real Heroes In Fight Against Covid-19: Sandhu, Am-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.అమెరికాలో 4 మిలియన్ల మంది భారతీయులు సాధిస్తున్న విజయాలతో తాను గర్విస్తున్నట్లు తెలిపారు.

మీరు (భారతీయ అమెరికన్ వైద్యులు) మీ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరులకు సాయం చేయడానికి సిద్ధంగా వున్న నిజమైన హీరోలంటూ సంధూ ప్రశంసించారు.

అట్లాంటాలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ స్వాతి విజయ్ కులకర్ణి మాట్లాడుతూ.

భారతీయ వైద్య సమాజాన్ని ఇండో- అమెరికన్ల వృద్ధికి నిదర్శనంగా అభివర్ణించారు.కోవిడ్ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం అందిస్తున్న అనేక కార్యక్రమాలు, ప్రణాళికల గురించి స్వాతి ప్రస్తావించారు.

అలాగే ఇండో- యూఎస్ స్ట్రాటజిక్ అలయన్స్ ప్రాముఖ్యతను కులకర్ణి నొక్కి చెప్పారు.ముఖ్యంగా ఆరోగ్య రంగంలో తక్కువ ధరకే నాణ్యమైనన ఔషధాలను అందించడంలో భారతదేశ పాత్రను ఆమె తెలిపారు.

ఈ సమావేశంలో ఏఏపీఐ వారియర్స్‌ను వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలను సత్కరించారు.కోవిడ్ 19 విపత్కర పరిస్ధితుల్లో మానవాళి కోసం వారు ప్రాణాలను ఆర్పించారని గుర్తుచేసుకున్నారు.ఏఏపీఐ అధ్యక్షుడు సుధాకర్ జొన్నలగడ్డ మాట్లాడుతూ.కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్‌లైన్ వైద్య నిపుణులకు నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు.

అమెరికాలో స్థిరపడిన భారతీయ అమెరికన్ వైద్యులు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.కాంగ్రెస్ సభ్యుడు బడ్డీ కార్టర్, కాంగ్రెస్ సభ్యురాలు కరోలిన్ బోర్డియక్స్ సహా పలువురు చట్టసభ సభ్యులు కూడా ఏఏపీఐ సమావేశంలో పాల్గొన్నారు.

Telugu Buddy Carter, Drswati, Indo Alliance-Telugu NRI

కాగా, కోవిడ్ సెకండ్ వేవ్‌లో ఏఏపీఐ వైద్యులు భారత్‌కు అండగా నిలిచిన సంగతి తెలిసిందే.పెద్ద ఎత్తున విరాళాలు, మందులు, వైద్య పరికరాలను ఇండియాకు పంపారు.దీనితో పాటు టెలీమెడిసిన్ సేవల ద్వారా ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube