ఒక్క పిలుపు.. 10 రోజుల్లో రూ.51 కోట్ల విరాళాలు: భారత్‌కు సేవా ఇంటర్నేషనల్ చేయూత

కరోనా విలయతాండవానికి భారతదేశం అల్లాడిపోతోంది.ఈ మహమ్మారి కోరల్లో చిక్కి లక్షలాది మంది విలవిలలాడిపోతున్నారు.

 Indian American Non Profit Sewa International Oxygen Concentrators India-TeluguStop.com

ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలాది మరణాలతో దేశంలో అంతులేని విషాదం నెలకొంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,01,078 లక్షల మందికి పాజిటివ్‌గా తేలగా, ఎప్పుడూ లేని విధంగా 4,187 మంది ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ఇండియాలో పరిస్ధితి భయానకంగా మారింది.ఇప్పటికే వైరస్‌ను కట్టడి చేసేందుకు రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, తమిళనాడు,కేరళ, బీహార్ వంటి రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించగా.

 Indian American Non Profit Sewa International Oxygen Concentrators India-ఒక్క పిలుపు.. 10 రోజుల్లో రూ.51 కోట్ల విరాళాలు: భారత్‌కు సేవా ఇంటర్నేషనల్ చేయూత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరికొన్ని చోట్ల కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారు.కోవిడ్ రోగులను కాపాడేందుకు ఇండియాలో మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది.

బెడ్లు, ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్, టెస్టింగ్ కిట్లు వంటివి ఎక్కడా దొరకడం లేదు.దీంతో భారత్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది.

ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, సింగపూర్, జర్మనీ తదితర దేశాల నుంచి ఆక్సిజన్, వైద్య సామాగ్రి, మందులు భారత్‌కు చేరుకున్నాయి.రానున్న రోజుల్లో ఈ సాయం మరింత పెరిగే అవకాశం వుంది.

అటు పుట్టెడు కష్టంలో వున్న జన్మభూమిని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐలు సైతం ముందుకొస్తున్నారు.ఇప్పటికే ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడుతున్న మనదేశంలోని ఆసుపత్రులకు రెండుసార్లు సాయం చేశారు భారత సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్ వినోద్ ఖోస్లా.

మరోవైపు ప్రవాసీ సంఘాలు కూడా భారత్‌కు సాయం చేస్తున్నాయి.దీనిలో భాగంగా ప్రముఖ ఎన్జీవో సంస్థ SEWA ఇంటర్నేషనల్.భారతీయ ఆసుపత్రులకు ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు‌ అందించేందుకు గాను “Help India Defeat COVID-19’’ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది.వీటితో పాటు భారత్‌లోని 10,000 కుటుంబాలకు, 1,000కి పైగా అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ఆహారం, మందులను అందిస్తామని తెలిపింది.

ఈ నేపథ్యంలోనే సేవా సంస్థ పిలుపుకు అనూహ్య స్పందన లభించింది.కేవలం 10 రోజుల్లోనే 7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.51 కోట్లు) విరాళాలుగా సేకరించినట్లు సేవా సంస్థ తెలిపింది.5 లక్షల డాలర్లను సమకూర్చడమే లక్ష్యంగా ఏప్రిల్ 25న విరాళల సేకరణను ప్రారంభించగా అనుకున్న దానికంటే ఎక్కువగానే నిధులు లభించాయని వెల్లడించింది.ఈ ఫండ్ ద్వారా భారత్‌కు అవసరమైన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్లు, మందులు, వైద్య సామాగ్రి వంటి వాటిని కొనుగోలు చేసి పంపుతామని సేవా నిర్వాహకులు తెలిపారు.ఈ సంస్థ ఇప్పటికే 1,466 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇండియాకు తరలించింది.

సేవా ఇంటర్నేషనల్ భాగస్వామ్య సంస్థ అయిన సేవా యునైటెడ్ కింగ్‌డమ్ మరో 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్‌కు పంపింది.

#COVID 19 Crisis #HelpIndia #Donations #NGOS

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు