స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ గ్రూప్‌లో భారత సంతతి మహిళకు కీలక పదవి..!!

ప్రముఖ భారతీయ అమెరికన్ ఆర్ధికవేత్త నౌరీన్ హసన్‌ స్విట్జర్లాండ్‌కు చెందిన ఆర్ధిక దిగ్గజం యూబీఎస్ అమెరికాస్ ప్రెసిడెంట్‌గా, యూబీఎస్ అమెరికాస్ హోల్డింగ్ సీఈవోగా నియమితులయ్యారు.ప్రస్తుతం ఆమె ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ తొలి వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

 Indian-american Naureen Hassan Appointed As President Of Ubs Americas And Ceo Of-TeluguStop.com

యూబీఎస్ అమెరికాస్ ప్రకటన ప్రకారం.హసన్ యూబీఎస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులోనూ పనిచేయనున్నారు.

ఆమె ఈ ఏడాది అక్టోబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.ఇప్పటి వరకు చేరి, టామ్ నారాటిల్‌లు యూబీఎస్ అమెరికాస్ ప్రెసిడెంట్‌గా, సీఈవోగా పనిచేశారు.

ఈ సంస్థల ప్రధాన కార్యాలయాలు జ్యూరిచ్, బాసెల్‌లలో వున్నాయి.యూబీఎస్ గ్రూప్ ఏజీ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న మల్టీనేషనల్ ఇన్వెస్ట్ బ్యాంక్.

అలాగే ఈ బ్యాంక్ ఆర్ధిక సేవలను కూడా అందిస్తుంది.ఇది అతిపెద్ద స్విస్ బ్యాంకింగ్ సంస్థగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

Telugu Federalreserve, Naureen Hassan, York, Switzerland, Ubs Americas-Telugu NR

హసన్.అక్టోబర్ 2022లో యూబీఎస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యురాలు కానున్నారు.దీంతో ఈ వారమే న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవుల నుంచి తప్పుకున్నారు.యూబీఎస్‌ గ్రూప్‌లో క్లయింట్ రిలేషన్స్, క్రాస్ – బిజినెస్ సహకారాన్ని ప్రోత్సహించడం, పబ్లిక్ పాలసీ ల్యాండ్‌స్కేప్‌ను నావిగేట్ చేయడం, సౌండ్ రెగ్యులేటరీ, రిస్క్ గవర్నన్స్ వంటి అంశాలకు హసన్ బాధ్యత వహించనున్నారు.

ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్‌లో చేరడానికి ముందు హసన్.మోర్గాన్ స్టాన్లీ వెల్త్ మేనేజ్‌మెంట్‌కు చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా వ్యవహరించారు.అలాగే చార్లెస్ స్వ్కాబ్ కార్పోరేషన్‌లో ఇన్వెస్టర్ సర్వీసెస్ స్ట్రాటజీ, సెగ్మెంట్స్, ఫ్లాట్‌ఫామ్‌లకు నాయకత్వం వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube