అమెరికా : స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కొత్త పోస్ట్.. తొలి అధికారి మన భారతీయుడే..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు అక్కడ అత్యున్నత పదవులను అందుకుంటున్న సంగతి తెలిసిందే.డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులుగా రాణిస్తున్నారు.

 Indian-american Named Dean Of Stanford University's Climate Change School , Prof-TeluguStop.com

తాజాగా భారత సంతతికి చెందిన మెటీరియల్ సైంటిస్ట్.ఇంజనీర్, ప్రొఫెసర్ అరుణ్ మజుందార్‌కు కీలక పదవి దక్కింది.

వాతావరణ మార్పు, స్థిరత్వంపై దృష్టి సారించేందుకు గాను స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ కొత్తగా నెలకొల్పిన స్కూల్‌కు తొలి డీన్‌గా ఆయన ఎంపికయ్యారు.స్టాన్‌ఫోర్డ్ న్యూస్ కథనం ప్రకారం.

ప్రపంచ వాతావరణ సంక్షోభానికి పరిష్కారాలను వేగవంతం చేసే లక్ష్యంతో స్టాన్‌ఫోర్డ్ డోయర్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ సెప్టెంబర్ 1న ప్రారంభంకానుంది.

ప్రస్తుతం జే ప్రీకోర్ట్ ప్రొవోస్టియల్ చైర్ ప్రొఫెసర్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల ఫ్యాకల్టీగా అరుణ్ మజుందార్ విధులు నిర్వర్తిస్తున్నారు.

గతంలో ప్రికోర్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ మాజీ డైరెక్టర్‌గానూ ఆయన సేవలు అందించారు.ఈ ఏడాది జూన్ 15న ఆయన తన కొత్త పదవిని స్వీకరించనున్నారు.

Telugu Berkeley, Indianamerican, Jayprecourt, Professorarun, Calinia, Google Ene

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన మజుందార్ 1985లో ఐఐటీ బాంబే నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి 1989లో పీహెచ్‌డీ పట్టా పొందారు.2011 నవంబర్ 30 నుంచి 2012 మే 15 మధ్య అమెరికాలో అండర్ సెక్రటరీ ఆఫ్ ఎనర్జీ పోస్ట్‌కు అరుణ్ నామినేట్ చేయబడ్డారు.కానీ అనివార్య కారణాల వల్ల ఈ నామినేషన్ ఉపసంహరించబడింది.అనంతరం గూగుల్‌ ఎనర్జీలో వైస్ ప్రెసిడెంట్‌గానూ సేవలందించారు.

2014లో స్టాన్‌ఫోర్డ్‌లో చేరిన ఆయన.అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ – ఎనర్జీ (ఏఆర్‌పీఏ-ఈ) వ్యవస్థాపక డైరెక్టర్‌గా వ్యవహరించారు.ప్రస్తుతం యూఎస్ సెక్రటరీ ఆఫ్ ఎనర్జీకి సలహాలు అందించే కౌన్సిల్‌కు చైర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube