అమెరికా: ప్రతిష్టాత్మక గాంధీ- మండేలా ఫౌండేషన్ చీఫ్‌గా తెలుగు ఎన్ఆర్ఐ

అహింస, శాంతి, సత్యాగ్రహం అనే ఆయుధాలతోనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి.దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించారు జాతిపిత మహాత్మగాంధీ.

 Indian American To Head Gandhi Mandela Foundation In Us, Gandhi Mandela Foundati-TeluguStop.com

ఆయన చూపిన బాటలోనే నల్లజాతి హక్కులపై పోరాడి విజయం సాధించారు నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా.ఈ ఇద్దరు మహనీయుల పేరుతో ఏర్పడిన గాంధీ- మండేలా ఫౌండేషన్ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది.ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థకు కొత్త చీఫ్‌గా తెలుగు మూలాలున్న ఓ ప్రవాస భారతీయుడు ఎంపికయ్యారు.

1980వ దశకంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు వలస వచ్చిన లుత్ఫీ హసన్ గురువారం గాంధీ- మండేలా ఫౌండేషన్ (జీఎంఎఫ్)లో ట్రస్ట్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు.యూఎస్‌లోని అపెక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు వ్యవస్థాపక ఛైర్మన్‌‌గా వున్న లుత్ఫీ.ఫౌండేషన్ ఫర్ ది అమెరికాస్- యూస్ రీజియన్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.న్యూఢిల్లీలోని ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంలో జీఎంఎఫ్ సెక్రటరీ జనరల్ నందన్ ఝా.లుత్ఫీతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి జామా మసీదు యునైటెడ్ ఫోరం అధ్యక్షుడు సయ్యద్ యహ్యా బుఖారీ హాజరయ్యారు.ఈ సందర్భంగా గాంధీ- మండేలా మెడల్‌ను లుత్ఫీ హాసన్‌కు అందజేశారు.

అనంతరం లుత్ఫీ మాట్లాడుతూ.ఫౌండేషన్‌ కార్యక్రమాల్లో యువత చురుగ్గా పాల్గొనేలా చేస్తానని చెప్పారు.

గాంధీ- మండేలా భావజాలాన్ని ప్రచారం చేస్తానని ఆయన వెల్లడించారు.

Telugu Gandhi Mandela, Indianamerican, Joe Biden, Kamala Harris, Lutfi Hassan, N

జీఎంఎఫ్ భారత ప్రభుత్వం వద్ద నమోదైన ట్రస్ట్.ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛ, మానవ హక్కులపై అవగాహన కల్పిస్తుంది.ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ అమెరికా, ఆఫ్రికా, రష్యా, బ్రిటన్, స్విట్జర్లాండ్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్‌లలో కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఇక లుత్ఫీ హాసన్ విషయానికి వస్తే.ఆయన అమరికన్ రాజకీయాల్లో దక్షిణాసియా సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేత.2008, 2012లలో ఒబామా తరపున ప్రచారం నిర్వహించారు.నేషనల్ ఫైనాన్స్ కో చైర్‌తో పాటు ప్రెసిడెన్షియల్, గుబెర్నేటోరియల్, సెనేటోరియల్, కాంగ్రెస్, మేయర్, జ్యూడీషియల్ ప్రచారాలకు సలహాదారుగా పనిచేశారు.

తాజా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ కోసం దక్షిణాసియా సలహా మండలిలో పనిచేశారు.ఇక బైడెన్- హారిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న దక్షిణాసియా ప్రముఖుల్లో లుత్ఫీ కూడా ఒకరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube