మెరుగైన జీవితం కోసమో, కుటుంబ ఆర్ధిక పరిస్ధితుల వల్లనో లక్షలాది మంది భారతీయులు ( Indians )పొట్ట చేతపట్టుకుని వివిధ దేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.అయితే అపారమైన ప్రతిభా పాటవాలతో పాటు శ్రమించే గుణం కారణంగా భారతీయులు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.
ఇది ఆయా దేశాల్లోని స్థానికులకు కంటగింపుగా మారింది.ఎక్కడి నుంచో వచ్చి తమ అవకాశాలను కొల్లగొడుతున్నారనే అక్కసుతో జాతి, వర్ణ వివక్షను చూపుతూ భారతీయులను మానసికంగా కృంగదీస్తున్నారు.
ఇక హత్యలు, భౌతిక దాడుల సంగతి సరేసరి.నిత్యం ప్రపంచంలోని ఏదో ఒక మూల భారతీయులపై జాత్యహంకార దాడులు జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
భారతీయులే కాదు.మిగిలిన దేశాలకు చెందిన ప్రజలు కూడా వలస వెళ్లిన ప్రాంతంలోని స్థానికులకు లక్ష్యంగా మారుతున్నారు.

ఈ క్రమంలో అమెరికాలోని మిచిగాన్‌కు( Michigan, USA ) చెందిన భారతీయ అమెరికన్ శాసనసభ్యుడు ద్వేషపూరిత నేరాల నిర్వచనాన్ని విస్తరించడానికి , ప్రార్ధనా స్థలాన్ని ధ్వంసం చేసిన ఘటనలను ఇందులో చేర్చడానికి బిల్లును ప్రవేశపెట్టారు.మిచిగాన్ స్టేట్ రిప్రజంటేటివ్‌గా వ్యవహరిస్తున్న రంజీవ్ పూరి( Ranjeev Puri ) ఈ బిల్లును ప్రవేశపెట్టారు.1970వ దశకంలో ఆయన తల్లిదండ్రులు అమృత్‌సర్ నుంచి అమెరికాకు వలస వచ్చారు.ద్వేష నేరాలకు సంబంధించిన బిల్లుతో పాటు దీపావళి, బైసాఖీ, ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ అధా, లూనార్ న్యూ ఇయర్‌లకు కూడా అధికారికంగా సెలవుదినాలుగా ప్రకటించేందుకు కూడా ఆయన బిల్లును ప్రవేశపెట్టారు.
మిచిగాన్ స్టేట్ రిప్రజంటేటివ్‌గా రెండవసారి వ్యవహరిస్తున్న ఆయన.ఇప్పుడు మిచిగాన్ హౌస్ మెజారిటీ విప్‌గానూ సేవలందిస్తున్నారు.

ఈ సందర్భంగా పీటీఐకి ( PTI )ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.మిచిగాన్‌లో ద్వేషపూరిత నేరాల బిల్లు 1988లో రాశారని, కానీ నేటి వారకు దానిని అప్‌డేట్ చేయలేదని పూరీ అన్నారు.ఈ నేపథ్యంలోనే తాము దీనిని మరింత సమగ్రంగా అప్‌డేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.కొత్త బిల్లు ప్రకారం.దేవాలయం, మసీదు, గురుద్వారా వంటి మతపరమైన కేంద్రాలను ధ్వంసం చేసినా, అపవిత్రం చేసినా దీనికి బాధ్యులైన వారిని విచారించడం ఇప్పుడు సులభతరం కానుందని పూరీ పేర్కొన్నారు.రంజీవ్ తండ్రి విస్కాన్సిన్‌లో తొలి సిక్కు గురుద్వారాను స్థాపించడంలో కీలకపాత్ర పోషించారు.
