అగ్రరాజ్యం సుప్రీం కోర్టు జడ్జిగా..భారత సంతతి వ్యక్తి..       2018-06-29   05:59:56  IST  Bhanu C

అమెరికాలో ప్రవాసుల కీర్తి పతాకాలు ఎప్పటికప్పుడు ఎగురుతూనే ఉన్నాయి..ఎక్కడ ఉన్నా తమకంటూ ఒక పత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం భారతీయులకి అలవాటే అయితే ఎంతో మంది అమెరికాలో ఎన్నో ఉన్నతమైన పదవులని అధిరోహించారు..ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు..అయితే అమెరికాలో అత్యన్నతమైన పదవిని మాత్రం ఎవరూ చేరుకోలేక పోయారు అయితే ఇప్పుడు భారత ప్రవాసీయుడు అమెరికాలో ఒక ఉన్నతమైన పదవిని చేపట్టబోతున్నారు..వివరాలలోకి వెళ్తే..

భారత సంతతికి చెందిన న్యాయ నిపుణుడు అమూల్‌ థాపర్‌.. అమెరికా సుప్రీంకోర్టులో జడ్జిగా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి..అయితే ఇప్పుడు అమెరికాలో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న “ఆంథోని కెన్నెడీ” జూలై 31 న జస్టిస్‌ పదవీ విరమణ చేయబోతున్నారు…అయితే ఆయన స్థానంలో ఆ అత్యున్నతమైన ఫీటాన్ని అధిరోచించేందుకు రూపొందించిన లిస్టు లో భారత సంతతి వ్యక్తి అయిన థాపర్‌ పేరు కూడా ఉండటం విశేషం.

అయితే ఈ జాబితా నుంచీ ఒకరిని కెన్నెడీ స్థానంలో నియమిస్తానని ట్రంప్‌ ఇది వరకే స్పష్టం చేశారు. కెన్నెడీ స్థానాన్ని భర్తీచేసేందుకు ట్రంప్‌ మనసులో ఉన్న తుది ఏడుగురిలో థాపర్‌ ఉన్నారని వాషింగ్టన్‌ పోస్ట్‌ ముందుగానే వెల్లడిచేసింది గతేడాదే ఆయన కెంటకీ జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. 1991లో బోస్టన్‌ కాలేజీ నుంచి బీఎస్‌ పూర్తిచేసిన థాపర్‌..కాలిఫోర్నియా వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు..అయితే ట్రంప్ గనుకా తుది పేరులో దాఫర్ గనుకా ఎంపిక చేస్తే అమెరికా అత్యన్నతమైన న్యాయస్థానం లో ఎన్నికైన మొట్టమొదటి ప్రవాస భారతీయుడిగా రికార్డు సృష్టించినట్టే.