న్యూజెర్సీ: వృత్తిపట్ల నిబద్ధత, అసాధారణ ప్రతిభ.. ఇండో అమెరికన్ టెక్కీకి అరుదైన గౌరవం

Indian American It Manager From New Jersey Wins High Praise And Highest Con Edison Honor

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన పలువురు భారతీయులు ఇక్కడ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు.తమ సమర్థత, తెలివి తేటలు, శ్రమించే గుణంతో యాజమాన్యాల ప్రశంసలు పొందుతున్నారు.

 Indian American It Manager From New Jersey Wins High Praise And Highest Con Edison Honor-TeluguStop.com

తాజాగా బ్రిడ్జ్‌వాటర్‌లో స్థిరపడిన భారతీయ అమెరికన్ మహిళ కవిత సుబ్బయ్య..

వృత్తిపట్ల నిబద్ధత, కార్యాచరణ నైపుణ్యంతో కాన్ ఎడిసన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్‌లో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు.కవితా సుబ్బయ్య.

 Indian American It Manager From New Jersey Wins High Praise And Highest Con Edison Honor-న్యూజెర్సీ: వృత్తిపట్ల నిబద్ధత, అసాధారణ ప్రతిభ.. ఇండో అమెరికన్ టెక్కీకి అరుదైన గౌరవం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ కంపెనీలో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
తన అసాధారణ ప్రతిభకు గాను Living Our Values Awardకు ఆమె ఎంపికయ్యారు.

దీనిని ఉద్యోగ నిర్వహణలో అత్యున్నత పాత్రను వహించే వారికి కాన్ ఎడిసన్ సంస్థ బహూకరిస్తోంది.కవిత ఈ అవార్డుకు ఎంపికైనట్లు అక్టోబర్ 15న ఈ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.తాను ఈ అవార్డును తన బృందానికి అంకితం చేస్తున్నాని చెప్పారు.తన సహాయక బృందం లేకుండా తాను ఈ అవార్డును సాధించలేనని కవిత అన్నారు.

కవిత ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి, కస్టమర్లకు సహాయం చేయడానికి, వ్యాపార ప్రక్రియను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తూనే వుంటారని కాన్ ఎడిసన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ సిస్టమ్స్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ జీనిన్ హాగర్టీ ప్రశంసించారు.

గ్యాస్ లీకేజీలకు సంబంధించి ఆమె కృషి .భదత్ర విషయంలో కాన్ ఎడిసన్‌కు గుర్తింపును తీసుకొచ్చిందన్నారు.

గత 23 ఏళ్లుగా కవితా సుబ్బయ్య కాన్ ఎడిసన్‌లో పనిచేస్తున్నారు.ఆమె దక్షిణ భారతదేశం నుంచి అమెరికాకు వలస వచ్చారు.మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో కవిత బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.దేశంలోనే పెట్టుబడిదారుల యాజమాన్యంలో నడుతుస్తున్న ఎనర్జీ కంపెనీలలో ఒకటైన కన్సాలిడేటెడ్ ఎడిసన్‌కు కాన్ ఎడిసన్ అనుబంధ సంస్థ.12 బిలియన్ డాలర్ల వార్షికాదాయం, 63 బిలియన్ డాలర్ల ఆస్తులు కన్సాలిడేటెడ్ ఎడిసన్‌ సొంతం.

#NRI #Kavitha Subbaih #IndianOrigin #IndianAmerican #Jersey

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube