అమెరికా : పీపీఈ కిట్లు సరఫరా చేస్తానంటూ మోసం... 2020 నాటి కేసులో భారత సంతతి వ్యక్తికి జైలు

రెండున్నరేళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మానవాళి జీవితాలను తలక్రిందులు చేసింది.కోవిడ్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా.

 Indian American In Us Sentenced To 4 Years In Jail For Fraud Covid-19 Scheme , I-TeluguStop.com

కోట్లాది మంది ఇంకా వైరస్ అనంతర అనారోగ్య సమస్యలతో చస్తూ బతుకుతున్నారు.ఇక ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం కావడంతో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డవారెందరో.

అయితే ఇలాంటి వారిని ఆదుకునేందుకు పలు దేశ ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే కొందరి స్వార్ధం కారణంగా అసలు ఉద్ధేశం పక్కదారి పడుతోంది.

వీటిని కొందరు అక్రమార్కులు దొడ్డిదారిన కాజేస్తున్నారు.

తాజాగా అమెరికాలో కోవిడ్ 19 మహమ్మారి సమయంలో తప్పుడు హామీలు చేసి ప్రజలను మోసం చేసిన 27 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి అమెరికా కోర్టు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

న్యూజెర్సీలోని మోంట్‌గోమెరీకి చెందిన గ్వారవ్ జిత్ రాజ్ సింగ్‌ గతంలో యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి పీటర్ షెరిడాన్ ముందు తన ఒక వైర్ ఫ్రాడ్ ఆరోపణలపై నేరాన్ని అంగీకరించాడు.ట్రంటన్ ఫెడరల్ కోర్టులో జస్టిస్ షెరిడాన్ నిందితుడికి 46 నెలల శిక్షను విధించినట్లు యూఎస్ అటార్నీ ఫిలిప్ సెల్లింగర్ తెలిపారు.

కేసులో దాఖలు చేసిన పత్రాలు, కోర్టులో నమోదు చేసిన వాంగ్మూలాల ప్రకారం.మే 2020 నుంచి రాజ్ సింగ్ మోసపూరితంగా ప్రేరేపించడం ద్వారా మోసానికి పాల్పడి వ్యక్తిగతంగా ప్రయోజనం పొందేందుకు యత్నించాడు.పీపీఈ కిట్లు అందజేస్తానంటూ 2 మిలియన్ డాలర్ల మేరకు మోసానికి పాల్పడ్డాడు.1.5 మిలియన్ల మెడికల్ గౌన్‌ల కోసం అతనికి దాదాపు 7.1 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని బాధితులు చెప్పారు.కోవిడ్ 19 మధ్య న్యూయార్క్ నగరానికి వీటిని సరఫరా చేస్తామనే ఒప్పందం కింద రాజ్ బాధితులను ప్రేరేపించాడు.

Telugu Garavjit, Indianamerican, Indian American, Jersey, Judgepeter-Telugu NRI

అయితే బాధితులు 7,12,500 అమెరికన్ డాలర్ల మొత్తానికి గాను 10 శాతం ప్రారంభ డిపాజిట్‌ను చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.అయితే బాధితుల నుంచి కొంత మొత్తాన్ని అందుకున్న తర్వాత రాజ్ సింగ్ .వారికి పీపీఈ కిట్లు అందించకుండా ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకునేవాడు.ఈ మొత్తంతో మెడికల్ కిట్లు కొనుగోలు చేసి డెలివరీ చేయడానికి బదులుగా.వ్యక్తిగత ఖర్చుల కోసం నిధులను ఉపయోగించాడు.ఈ నేరానికి గాను రాజ్‌సింగ్‌కి న్యాయమూర్తి షెరిడాన్ సింగ్‌కు జైలు శిక్షను విధించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube