ఎన్నికల బరిలో దిగండి.. ఆర్ధిక సాయం మేం చేస్తాం : ఇండియన్ అమెరికన్లకు ప్రవాసీ సంస్థ పిలుపు

అమెరికాలో వ్యాపారాలు, వైద్యం వంటి రంగాలలో కీలక హోదాల్లో వున్నప్పటికీ… దక్షిణాసియన్లు ప్రస్తుత వ్యవస్థలో అంతగా ప్రాతినిథ్యం వహించడం లేదన్నారు ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ మఖిజా.ఓ భారత జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.తాము ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లను చూస్తున్నామనన్నారు.ప్రతి ఏడాది ప్రభుత్వంలోని అన్ని స్థాయిలలో వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోందని మఖిజా పేర్కొన్నారు.అయితే రెండవతరం ప్రాతినిధ్యం వహించే అమెరికాను చూడాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు.

 Indian American Impact Executive Director Neil Makhija Comments On Indian Americ-TeluguStop.com

స్థానిక, రాష్ట్ర, సమాఖ్య ఎన్నికల్లో అమెరికా అంతటా పోటీ చేస్తున్న అనేక మంది భారతీయ అమెరికన్ అభ్యర్ధులకు ఇంపాక్ట్ మద్ధతుగా నిలుస్తోందన్నారు.

వీరిలో వెస్ మూర్‌తో పాటు ఇటీవల మేరీలాండ్‌ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా డెమొక్రాటిక్ పార్టీ ప్రైమరీ నామినేషన్‌ను గెలుపొందిన అరుణా మిల్లర్ కూడా వున్నారు.నవంబర్ 2022 ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తే .ఆ రాష్ట్రంలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేసిన తొలి భారతీయ అమెరికన్ మహిళగా అరుణ చరిత్ర సృష్టిస్తారు. దక్షిణాసియా సంతతికి చెందిన చాలామంది చారిత్రాత్మక అభ్యర్ధులుగా పోటీపడుతున్నారు.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున తాము ఎండార్స్‌మెంట్‌లను కొనసాగిస్తామని.ఈ ఏడాది దాదాపు 30 ఎండార్స్‌మెంట్‌లను అంచనా వేస్తున్నట్లు మఖిజా అన్నారు.

దక్షిణాసియా సంతతి సభ్యులు దేశంలో అపరిచితులుగా భావించకుండా .ముందుకు సాగడం, నాయకత్వం వహించడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.ఇంపాక్ట్‌కు మద్ధతిచ్చే అనేక మంది అభ్యర్ధులు తుపాకీ సంస్కరణలు, పునరుత్పత్తి హక్కులు, శ్రామిక కుటుంబాలకు మద్ధతు వంటి అంశాలపై ఫోకస్ పెట్టారు.ఇంపాక్ట్ నుంచి పబ్లిక్ ఎండార్స్‌మెంట్‌తో పాటు అభ్యర్ధులు రాష్ట్ర , ఫెడరల్ నియమాలకు అనుగుణంగా ఆర్ధిక సహాయాన్ని పొందుతారని మఖిజా తెలిపారు.

Telugu American, Aruna Miller, Indian, Maryland, Neil Makhija, Wes Moore-Telugu

ఇకపోతే.వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తోన్న ప్రవాస సంస్థ ఇండియాస్పోరా కూడా భారతీయ అమెరికన్లకు రాజకీయ రంగ ప్రవేశానికి మద్ధతు ఇవ్వడంపై పెద్ద ఎత్తున దృష్టి సారించింది.ఈ సందర్భంగా ఈ సంస్థ ఛైర్మన్ ఎంఆర్ రంగస్వామి మాట్లాడుతూ… రాజకీయ రంగంలోకి అడుగుపెడుతోన్న భారతీయ అమెరికన్లకు సహాయం చేయాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.ఒక సంస్థగా నిధులు సేకరించలేకపోయినప్పటికీ.

తమ సభ్యులు అనేక మంది భారతీయ అమెరికన్ల ఎన్నికల ప్రచారానికి వేలాది డాలర్లు విరాళంగా అందించారని రంగస్వామి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube