యూఎస్ : రిపబ్లికన్ పార్టీకి సారథ్యం.. తృటిలో మిస్సయిన భారత సంతతి మహిళ

భారత సంతతికి చెందిన పంజాబీ మహిళ హర్మీత్ ధిల్లాన్ తృటిలో రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్‌సీ)కి అధ్యక్షత వహించే అవకాశం కోల్పోయారు.అయితే ఆమెకు విస్తృతంగా మద్ధతు లభించింది.

 Indian-american Harmeet Dhillon Loses The Republican National Committee Polls De-TeluguStop.com

కాలిఫోర్నియాలో జరిగిన కమిటీ సమావేశంలో ప్రస్తుత ఆర్ఎన్‌సీ ఛైర్ రోన్నా మెక్‌డానియల్స్ మరోసారి ఎన్నికయ్యారు.మూడు వరుస పరాజయాలతో పాటు సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందించనప్పటికీ ఆయనకే రిపబ్లికన్లు పట్టం కట్టారు.

ఆర్ఎన్‌సీ అధ్యక్షుడిగా మెక్‌డానియల్ సారథ్యంలో రిపబ్లికన్ పార్టీ 2018లో ప్రతినిధుల సభ, 2020లో సెనేట్, అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది.దీనితో పాటు గతేడాది నవంబర్‌లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ రిపబ్లికన్ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకోకపోవడంతో డానియల్ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.

168 మంది సభ్యులున్న ఆర్ఎన్‌సీలో మెక్‌డానియల్‌కు 111 ఓట్లు, హర్మీత్ ధిల్లాన్‌కు 51 ఓట్లు దక్కాయి.మెక్‌డానియల్స్, హర్మీత్‌తో మంచి సంబంధాలున్న మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎవరికీ మద్ధతు ప్రకటించకుండా తటస్థంగా వున్నారు.2017లో ఆర్ఎన్‌సీకి అధిపతిగా మెక్‌డానియల్స్‌కు ట్రంప్ మద్ధతు పలికారు.ఇక.2020 అధ్యక్ష ఎన్నికల్లోనూ, 2021 కాపిటల్ హిల్స్ అల్లర్లపై హౌస్ కమిటీ విచారణలోనూ ధిల్లాన్ ట్రంప్‌ న్యాయవాదుల్లో ఒకరిగా సేవలందించారు.

Telugu Donald Trump, Harmeet Dhillon, Indian American, Mc Daniel, Punjab Nri, Rn

అయితే కొన్ని మీడియా నివేదికలు మాత్రం.ట్రంప్ మెక్‌డానియల్‌కు రహస్యంగా మద్ధతు పలికారని చెబుతున్నాయి.కానీ హర్మీత్ ధిల్లాన్‌కు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ మద్ధతు లభించింది.

ఈయన 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్స్‌లో ట్రంప్‌ను ఆయన సవాల్ చేసే అవకాశం వుంది.

ఆర్ఎన్‌సీలో కొత్త రక్తం ప్రవహించాలని డిసాంటీస్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.హర్మీత్ ధిల్లాన్‌కు రెండు రాష్ట్ర కమిటీలు, నెవాడా, వాషింగ్టన్, నాలుగు రాష్ట్రాలలో పార్టీ అధిపతులు, ఉన్నత స్థాయిలో పార్టీకి దాతలుగా వున్న వారు, మీడియా ప్రముఖుల నుంచి గట్టి మద్ధతు లభించింది.

Telugu Donald Trump, Harmeet Dhillon, Indian American, Mc Daniel, Punjab Nri, Rn

ఇదిలావుండగా.1969 జూలై 19న పంజాబ్‌లోని చండీగఢ్‌లో జన్మించారు హర్మీత్ ధిల్లాన్.ఆమె పసితనంలోనే ధిల్లాన్ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది.హర్మీత్ తండ్రి ఆర్థోపెడిక్ సర్జన్.అనంతరకాలంలో నార్త్ కరోలినాలోని స్మిత్‌ఫీల్డ్‌లో ఆమె కుటుంబ స్ధిరపడింది.తర్వాత డార్ట్‌మౌత్ కాలేజీలో చదువుకున్నారు హర్మీత్.

యూనివర్సిటీ ఆఫ్ వర్జినియా స్కూల్ ఆఫ్ లాలో గ్రాడ్యుయేషన్ చేసిన హర్మీత్ ధిల్లాన్ . తర్వాత పలువురు పేరు మోసిన అటార్నీల వద్ద క్లర్క్‌గా పనిచేశారు.రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలైన ఆమె పార్టీలో చేరి క్రీయాశీలకంగా పనిచేస్తున్నారు.2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్‌కు సలహాదారుగానూ విధులు నిర్వర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube