అమెరికాలో...అమెరికన్ ఇండియన్ ఫెస్టివల్ డే

అమెరికాలో ఉన్న ఇండియన్ వారి వారి ప్రాంతాలకి తగ్గట్టుగా సంస్థలని ఏర్పాటు చేసుకుని వారి రాష్ట్రాల సంస్కృతులని, పండగలని నిర్వహించుకుంటూ ఉంటారు.అయితే అమెరికాలో ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ భారతీయులు అందరూ కలిసికట్టుగా అమెరికాలో ఉండాలని, అమెరికా సంస్కృతిలో అందరూ భాగం కావాలని కోరుతూ అమెరికన్ ఇండియన్ ఫెస్టివల్ డే నిర్వహిస్తోంది.

 Indian American Festival Day 2019-TeluguStop.com

అందులో భాగంగానే ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్.తోటకూర ప్రసాద్ అమెరికన్ ఇండియన్ ఫెస్టివల్ డే ని నిర్వహిస్తున్నట్టుగా ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని మే 4 వ తేదీన మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకూ ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రతీ ఒక్కరూ ఆహ్వనితులేనని తెలిపారు.

ఈ వేడుకలో భాగంగా పిల్లలకి, పెద్దలకి , అని వయసుల వారికి ఎన్నో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.వివిధ రకాల వంటకాలతో ఫుడ్ స్టాల్స్ , బిజినెస్ స్టాల్స్ కూడా ఈ వేడుకలో ఉంటాయని అన్నారు.

దాదాపు 500 మందికి పైగా భారత సంతతి కి చెందినా వారితో పాటు అమెరికన్ యువతీ యువకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రసాద్ తెలిపారు.మరిన్ని వివరాల కోసం www.iafcusa.org ద్వారా సభ్యులని సంప్రదించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube