ఫ్లోరిడా కన్వెన్షన్‌కు రిపబ్లికన్‌ ప్రతినిధిగా భారతీయ అమెరికన్: వరుసగా ఐదోసారి ఎన్నిక…!!  

Indian-American Dr Sampat Shivangi Elected Republican Delegate For Florida Convention, Dr Sampat Shivangi ,Florida Convention,RNC,Republican party - Telugu Dr Sampat Shivangi, Florida Convention, Indian-american Dr Sampat Shivangi Elected Republican Delegate For Florida Convention, Republican Party, Rnc

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నవంబర్‌ జరిగే అధ్యక్ష ఎన్నికల్లో అధికారికంగా నామినేట్ చేసే రిపబ్లికన్ ఆగస్టు కన్వెన్షన్‌కు పార్టీ ప్రతినిధిగా భారతీయ అమెరికన్ డాక్టర్ సంపత్ శివంగి ఎన్నికయ్యారు.ఆయన ఇలా ఎన్నికవ్వడం ఇది వరుసగా ఐదోసారి.

 Indian American Dr Sampat Shivangi Elected Republican Delegate

ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేలో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌ (ఆర్ఎన్‌సీ) ఆగస్టు 24 నుంచి ఆగస్టు 27 వరకు జరగనుంది.

ప్రస్తుతం ఇండియన్ అమెరికన్ ఫోరం ఫర్ పొలిటికల్ ఎడ్యుకేషన్ నేషనల్ అధ్యక్షుడిగా సంపత్ వ్యవహరిస్తున్నారు.

ఫ్లోరిడా కన్వెన్షన్‌కు రిపబ్లికన్‌ ప్రతినిధిగా భారతీయ అమెరికన్: వరుసగా ఐదోసారి ఎన్నిక…-Telugu NRI-Telugu Tollywood Photo Image

రిపబ్లికన్ కన్వెన్షన్‌తో పాటు త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు అమెరికాకి, భారతదేశానికి, మొత్తం ప్రపంచానికి చారిత్రాత్మకమైనవని శివంగి అభివర్ణించారు.దేశ నిర్మాణంలో తన వంతు సహకారం అందిస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నానని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా 2004లో న్యూయార్క్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్‌కు సంపత్ తొలిసారిగా ప్రతినిధిగా ఎంపికయ్యారు.ఆ సదస్సులో జార్జ్‌డబ్ల్యూ బుష్‌ను రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా ప్రకటించారు.2008లో మిన్నియాపోలీస్ కన్వెన్షన్‌‌కు రెండోసారి ఎన్నికైన సంపత్.జాన్‌ మెక్కెయిన్‌ను, 2012లో టాంపాలో మిట్ రోమ్నీలను అధ్యక్ష అభ్యర్ధులుగా ప్రతిపాదించారు.2016లో క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన ఆర్ఎన్‌సీ సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను డాక్టర్ సంపత్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా నామినేట్ చేశారు.

ట్రంప్‌ను తిరిగి ఎన్నుకునే ఈ చారిత్రక సదస్సులో భాగం కావడం గొప్ప గౌరవమని శివంగి అన్నారు.

ట్రంప్ హయాంలో అమెరికా అద్భుతమైన పురోగతి సాధించిందని, కరోనా వచ్చే వరకు అమెరికా ఆర్ధిక వ్యవస్ధ అగ్రస్థానంలో ఉందని ఆయన గుర్తుచేశారు.డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి, భారతీయ అమెరికన్లకు మంచి స్నేహితుడని సంపత్ అన్నారు.

#RNC

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian American Dr Sampat Shivangi Elected Republican Delegate Related Telugu News,Photos/Pics,Images..