అమెరికా: భారత సంతతి నేత రాజా కృష్ణమూర్తికి మరో కీలక పదవి...!

భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తికి మరో కీలక పదవి దక్కింది.కాంగ్రెస్ ఆసియా పసిఫిక్ అమెరికన్ కాకస్‌ (సీఏపీఏసీ)లోని కీలకమైన ఇమ్మిగ్రేషన్ టాస్క్‌ఫోర్స్ కో చైర్‌గా ఆయన నియమితులయ్యారు.

 Indian-american Congressman Raja Krishnamoorthi Appointed Co-chair Of Immigratio-TeluguStop.com

అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళ ప్రమీలా జయపాల్ ఈ టాస్క్‌ఫోర్స్‌కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.డ్రీమర్స్ , తాత్కాలిక రక్షణ స్థితి (టీపీఎస్) గ్రహీతలను రక్షించడం, సమగ్ర ఇమ్మిగ్రేషన్ సంస్కరణలకు మద్ధతునివ్వడం వంటి అంశాలలో సహాయం చేయడం ఇమ్మిగ్రేషన్ టాస్క్‌ఫోర్స్ లక్ష్యం.

ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ అమెరికన్ విలువలను ప్రతిబింబించేలా పోరాటం పోరాటం చేస్తున్న ప్రమీల జయపాల్‌తో పాటు సీఏపీఏసీ ఇమ్మిగ్రేషన్ టాస్క్‌ఫోర్స్ కో చైర్‌గా నియమించబడటం తనకు గౌరవంగా వుందని కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలియజేశారు.ఆయన ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి ప్రతినిధుల సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

తాను నెలల చిన్నారిగా వున్నప్పుడు తన తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికాకు వలసవచ్చారని కృష్ణమూర్తి తెలిపారు.ఈ రోజు వలసదారులు చేసినట్లే వారు అప్పట్లో అమెరికన్ డ్రీంను విశ్వసించారని ఆయన వెల్లడించారు.

అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఏఏపీఐ) వలసదారులు సహా అమెరికాకు రావాలనుకుంటున్న వారి కోసం ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మెరుగుపరచడానికి తన వంతు పాత్ర పోషిస్తానని కృష్ణమూర్తి స్పష్టం చేశారు.

Telugu Capac, Congressmanraja, Covid, Task Force, Indianamerican-Telugu NRI

న్యూఢిల్లీలో తమిళ కుటుంబంలో జన్మించిన రాజా కృష్ణమూర్తికి మూడు నెలల వయసు వున్నప్పుడు ఆయన కుటుంబం న్యూయార్క్‌లోని బఫెలోకి వచ్చింది.ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన కృష్ణమూర్తి.అనంతరం హార్వర్డ్ లా స్కూల్‌లోనూ చదువుకున్నారు.

నవంబర్‌లో నలుగురు భారతీయ అమెరికన్ డెమొక్రాటిక్ సభ్యులు డాక్టర్ అమీబేరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తిలు ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికైన సంగతి తెలిసిందే.కాగా, కొద్దిరోజుల క్రితం ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తిలను బడ్జెట్‌, కరోనా వైరస్‌లకు సంబంధించిన కాంగ్రెస్ కమిటీలలో సభ్యులుగా నియమిస్తూ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆదేశాలు జారీ చేశారు.

శక్తివంతమైన బడ్జెట్ కమిటీకి ప్రమీలా జయపాల్ (55)ను, కోవిడ్ సంక్షోభం నిమిత్తం ఏర్పాటైన కమిటీకి రాజా కృష్ణమూర్తి (47)ని పెలోసి ఎంపిక చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube