భారతీయ సభ్యుడి తీర్మానం... అంబేద్కర్‌ను స్మరించిన అమెరికా ప్రతినిధుల సభ

రాజ్యాంగ నిర్మాత, వెనుకబడిన వర్గాల ఉన్నతి కోసం కృషి చేసిన మహనీయుడు, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా భారతావని ఆయనకు నివాళులర్పించింది.ప్రవాస భారతీయులు సైతం అంబేద్కర్‌ సేవలను స్మరించారు.

 Indian American Congressman Introduces Resolution To Honour Br Ambedkar-TeluguStop.com

భారత సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఆర్‌వో ఖన్నా… అంబేద్కర్‌ గౌరవార్థం ప్రతినిధుల సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న యువ నాయకులు ప్రేరణ పొందుతారని ఖన్నా అభిప్రాయపడ్డారు.

ఆయన రచనలను చదివి స్పూర్తి పొందాలనే ఉద్దేశ్యంతో తాను రెండోసారి ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఖన్నా తెలిపారు.ఈ తీర్మానం ద్వారా అమెరికాలోని వివక్ష పట్ల, ప్రత్యేకించి ఆఫ్రికన్- అమెరికన్లు, మహిళల వివక్షను తొలగించి ప్రతి ఒక్కరికి సమాన హక్కులకు హామీ ఇచ్చే ప్రయత్నానికి బాసటగా వుంటుందని ఆయన చెప్పారు.

 Indian American Congressman Introduces Resolution To Honour Br Ambedkar-భారతీయ సభ్యుడి తీర్మానం… అంబేద్కర్‌ను స్మరించిన అమెరికా ప్రతినిధుల సభ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంబేద్కర్ సాధించిన విజయాలను గౌరవించడంతో పాటు మానవహక్కుల సార్వత్రిక ప్రకటనలో పేర్కొన్న విధంగా అంటరానితనం, కులవివక్షను అన్ని రూపాల్లో నిషేధించాలంటూ ఖన్నా తీర్మానంలో ప్రస్తావించారు.సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ ప్రజలందరికీ అవసరమైన హక్కులని గుర్తించిన ఈ తీర్మానం.

ఆర్ధికశాస్త్రం, రాజకీయ శాస్త్రం, పౌర హక్కులు, మత సామరస్యం, న్యాయ శాస్త్రాలకు అంబేద్కర్ చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపిందని ఆర్‌వో ఖన్నా అన్నారు.కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత రాజ్యాంగ నిర్మాణంతో పాటు సమాజానికి అంబేద్కర్ ఎనలేని సేవ చేశారంటూ 2010లో భారత పార్లమెంట్‌లో ప్రశంసించారు.

Telugu Barack Obama, Dr. Br Ambedkar, Finance Commission, Madhya Pradesh, R.o. Khanna, Reserve Bank Of India-Telugu NRI

1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అంబవాడేలో (అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన ‘మౌ’అన్న ఊరిలో) అంబేద్కర్ జన్మించారు.ఆయన తల్లిదండ్రులు… రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్‌ .పూర్తి పేరు భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్.అప్పట్లో చదువుకోవాలన్నా…మంచినీళ్ళు తాగాలన్నా కులమే అడ్డుగా నిలబడింది.ఈ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని కష్టపడి చదువుకున్నారు.సమాజంలో వర్ణ, వర్గభేదాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొందించారు.డాక్టర్ అంబేద్కర్ చరిత్రలోనే అతిపెద్ద పౌర హక్కుల ఉద్యమాలలో ఒకటిగా పరిగణించే పోరాటానికి నాయకత్వం వహించి దళితులకు ప్రాథమిక హక్కులను కల్పించడానికి కృషి చేశారు.

అలాగే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17ను చేర్చడంలో విజయవంతమయ్యారు.ఆర్ధికవేత్తగా ఆయన రాసిన గ్రంథాలు ఫైనాన్స్ కమీషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయి.

#Dr. BR Ambedkar #ReserveBank #Barack Obama #R.O. Khanna #Madhya Pradesh

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు