సిటిజన్‌షిప్ యాక్ట్‌: అమెరికాకే లాభం, భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడి వ్యాఖ్యలు

అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా విదేశీయులకు ప్రతిబంధకంగా వున్న ఆంక్షలను ఎత్తివేయాలని జో బైడెన్ యంత్రాంగం నిర్ణయించిన సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా గ్రీన్ కార్డులపై దేశాల కోటా పరిమితిని ఎత్తేయడంతో పాటు అమెరికాలో అక్రమంగా వుంటున్న 1.1 కోట్ల మంది వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన అమెరికా పౌరసత్వ బిల్లు 2021ని ప్రభుత్వం కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.దీనికి ప్రతినిధుల సభ, సెనేట్ ఆమోదం లభించి, బైడెన్ సంతకం చేస్తే ఇది చట్టంగా రూపుదాల్చనుంది.

 Indian-american Congressman Hails Move To Eliminate Country Quota For Employment-TeluguStop.com

అయితే ఈ బిల్లుపై భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ బిల్లు అమెరికాకే లాభం చేకూర్చుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వివిధ దేశాలకు ఇచ్చే ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోటా పరిమితిని ఎత్తివేయడం, హెచ్1బీ వీసాదారులపై ఆధారపడిన వారికి వర్క్ పర్మిట్లు లభించడం ద్వారా అమెరికాయే లబ్ధి పొందుతుందని కృష్ణమూర్తి పేర్కొన్నారు.వివిధ దేశాలకు చెందిన మేధావులు, నిపుణులు అమెరికాలో స్థిరపడటం ద్వారా అగ్రరాజ్యం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.

అలాగే సిటిజన్‌షిప్ యాక్ట్‌ ఆమోదం పొందేందుకు మద్ధతిస్తానని రాజా కృష్ణమూర్తి స్పష్టం చేశారు.

Telugu Green, Hb Visa, Indianamerican-Telugu NRI

ఇక బిల్లు ఆమోదం విషయానికి వస్తే, కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు పూర్తి మెజారిటీ ఉంది.ఎగువ సభ అయిన సెనేట్‌లో ఇరు పార్టీలకు 50 చొప్పున సీట్లు ఉన్నాయి.ఇక్కడ బిల్లు పాస్‌ కావాలంటే మరో 10 మంది రిపబ్లికన్ల మద్దతు అవసరం.

అయితే దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుదన్నుగా ఉన్న వలసదారుల శ్రేయస్సు కోసం రిపబ్లికన్లు ఈ బిల్లుకి మద్దతునిస్తారని బైడెన్ ఆకాంక్షించారు.బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం బైడెన్‌ గత ప్రభుత్వ తప్పిదాలను సవరిస్తూ వలసదారులకి న్యాయం జరిగేలా చూద్దామని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.

ఈ బిల్లు ఆమోదం పొందితే గ్రీన్‌కార్డు మంజూరులో ఏడు శాతం దేశాల కోటాను ఎత్తేస్తూ మొదట దరఖాస్తు చేసుకునే వారికి మొదట గ్రీన్‌కార్డు జారీ చేసేలా నిబంధనల్లో మార్పు చేశారు.దీంతో పదేళ్లకు పైబడి గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు ఎక్కువ ప్రయోజనం కలగనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube