అమెరికా కాంగ్రెస్ కీలక సబ్ కమిటీకి ఛైర్మన్‌‌గా ఇండో-అమెరికన్ అమీ బేరా

అమెరికా చట్ట సభల్లో సుధీర్ఘ అనుభవమున్న భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు అమీ బేరా ఆసియా వ్యవహారాలకు సంబంధించిన కీలకమైన సబ్ కమిటీకి ఛైర్మన్‌గా నియమితులయ్యారు.కాలిఫోర్నియాకు చెందిన బేరా డెమొక్రాటిక్‌ పార్టీ నుంచి నాలుగు సార్లు కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు.

 Indian American Congressman Ami Bera-TeluguStop.com

ఇప్పటి వరకు ఆసియా, పసిఫిక్ మరియు నాన్‌ప్రొలిఫరేషన్‌ సబ్‌కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న బెరా బ్రాడ్ షెర్మాన్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.

దీనిపై అమీ బేరా స్పందిస్తూ ఈ పదవిలో తనను నియమించినందుకు గౌరవంగా ఉందన్నారు.

ప్రపంచంపై అత్యంత ప్రభావాన్ని చూపే దేశాలు ఆసియా ఖండంలో ఉన్నాయని.అమెరికా సంయుక్త రాష్ట్రాలతో ఆయా దేశాలు ధృఢమైన, శాశ్వత సంబంధాలను కలిగి ఉన్నాయని ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఉప కమిటీ ఛైర్మన్‌గా రాజకీయ, సైనిక, సాంస్కృతిక, ఆర్ధిక రంగాల్లో అమెరికాకు ప్రయోజనం చేకూర్చేలా కృషి చేస్తానని బేరా స్పష్టం చేశారు.

Telugu Ami Bera, Chairmankey, Indianamerican, Telugu Nri Ups-

ఆసియా, పసిఫిక్‌ దేశాలతో అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని అమీ బేరా వెల్లడించారు.ఆసియా, పసిఫిక్ లోని అమెరికా మిత్ర, భాగస్వామ్య దేశాలతో సంబంధాలు ఏ విధంగా బలోపేతం చేయాలనే దానిపై ఈ ఉప కమిటీ అధ్యయనం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.మానవ హక్కులను గౌరవించే పౌర, ప్రభుత్వేతర సంస్థలకు తమ కమిటీ అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని బేరా చెప్పారు.

ర్యాంకింగ్ సభ్యుడు టెడ్ యో హూ అతని సహచరులతో కలిసి ఉప కమిటీలో పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానన్నారు.తద్వారా ఆసియాలో మరింత స్థిరమైన, స్వేచ్చాయుత వాతావరణాన్ని ప్రొత్సహించేందుకు అమెరికా అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేస్తామని అమీ బేరా తెలిపారు.

బేరా అంతకు ముందు భారత్, భారతీయ అమెరికన్లపై కాంగ్రెస్ కాకస్‌కు అధ్యక్షత వహించారు.ప్రస్తుతం కొరియాపై కాంగ్రెస్ కాకస్‌కు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube