అమెరికా: భారతీయుడికి కీలక పదవి.. నియామకానికి యూఎస్ సెనేట్ ఆమోదముద్ర

నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ ప్రైమరీ కేర్ ఫిజిషియన్ డాక్టర్ రాహుల్ గుప్తా నియామకాన్ని యూఎస్ సెనేట్ గురువారం ధృవీకరించింది.తద్వారా వైట్‌హౌస్‌‌ ఆఫీస్ ఆఫ్ నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ (ఓఎన్‌డీసీపీ)కి నాయకత్వం వహించిన మొదటి వైద్యుడిగా రాహుల్ చరిత్ర సృష్టించారు.

 Indian-american Confirmed As Director Of Us National Drug Control Policy ,  Us N-TeluguStop.com

జార్జ్‌టౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో మెడిసిన్ విభాగంలో క్లినికల్ ప్రొఫెసర్‌గా పనిచేసిన డాక్టర్ గుప్తా నియామకానికి గురువారం సెనేట్ ఆమోదముద్ర వేసింది.

ప్రాక్టీసింగ్ ఫిజిషియన్‌గా గ్రామీణ వర్గాలలో సేవలందించారు రాహుల్.

కమ్యూనిటీలను ఆరోగ్యవంతంగా మార్చేందుకు ఉన్నత- నాణ్యమైన వ్యూహాలను ముందుకు తీసుకెళ్లేందుకు తాను శ్రద్ధగా పనిచేస్తానని ఆయన చెప్పారు.అంటు వ్యాధులను పరిష్కరించడం తన తక్షణ ప్రాధాన్యత అని అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారని రాహుల్ వెల్లడించారు.

ఈయన అమెరికాలోని ఎన్జీవో సంస్థ మార్చ్ ఆఫ్ డైమ్స్‌లో చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్‌గా, తాత్కాలిక చీఫ్ సైన్స్ ఆఫీసర్‌గా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.ఈ క్రమంలో మాతాశిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేశారు.

అంతేకాకుండా జార్జ్‌టౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో మెడిసిన్ విభాగంలో క్లినికల్ ప్రొఫెసర్‌గా, వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో హెల్త్ పాలసీ, మేనేజ్‌మెంట్ అండ్ లీడర్‌షిప్ విభాగంలో అనుబంధ ప్రొఫెసర్‌గా, హార్వర్డ్ టీహెచ్‌లో విజిటింగ్ ఫ్యాకల్టీగా రాహుల్ పనిచేశారు.ప్రైమరీ కేర్ ఫిజిషియన్‌గా ఆయనకు 25 ఏళ్ల అనుభవం వుంది.

వెస్ట్ వర్జీనియా హెల్త్ కమీషనర్‌గా ఇద్దరు గవర్నర్ల కింద పనిచేశారు.ఎబోలా, జికా వైరస్ వ్యాప్తి సమయాల్లోనూ కార్యచరణ ప్రణాళికలను రాహుల్ రూపొందించారు.

Telugu Alabama, Indianamerican, Biden, Rahul, Birmingham, National Drug, Whitena

భారతీయ దౌత్యవేత్త కుమారుడైన రాహుల్ భారత్‌లోనే జన్మించారు.వాషింగ్టన్ డీసీలో పెరిగిన ఆయన.ఢిల్లీ యూనివర్సిటీలో మెడికల్ విభాగంలో పట్టాపొందాడు.అలబామా బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్ డిగ్రీని, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ నుంచి గ్లోబల్ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని పొందారు.

వెటరన్స్ అడ్మినిస్ట్రేషన్‌లో వైద్యురాలిగా పనిచేస్తున్న సీమా గుప్తాను వివాహం చేసుకున్నారు.వారికి అర్కా, డ్రూలు అనే కవలలు జన్మించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube