టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో నలుగురు భారత సంతతి మహిళలపై జరిగిన విద్వేషదాడిని ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఖండించింది.డల్లాస్‌లోని ఓ రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నాకు భారతీయులంటే అసహ్యం… అక్కడ మంచి జీవితం లేకపోవడం వల్లే మీరంతా అమెరికా వస్తున్నారు.మీ దేశానికి మీరు వెళ్లిపోండి.
ఎక్కడికి వెళ్లినా మీరే కనిపిస్తున్నారంటూ ఎస్మలార్డా ఆప్టన్ అనే మహిళ భారత సంతతి మహిళలను అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు దాడికి దిగింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై భారతీయ అమెరికన్ సంఘాలు భగ్గుమన్నాయి.
ఇండియాస్పోరా సంస్థకు చెందిన సంజీవ్ జోషిపురా మాట్లాడుతూ.ఈ ఘటన అమెరికాలోని భారతీయులను షాక్‌కు గురిచేసిందన్నారు.
ఈ దాడిని తాము ఖండిస్తున్నామని.వివక్ష ఏ రూపంలో వున్నా దానిపై పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.
అమెరికాకి వలస వచ్చిన భారతీయ అమెరికన్ల సహకారం విస్తృతంగా గుర్తించబడిందని సంజీవ్ అన్నారు.ఇండియన్ కమ్యూనిటీని అప్రమత్తంగా వుండమని, ఎలాంటి బెదిరింపులు ఎదురైనా వ్యతిరేకంగా నిలబడాలని ఆయన కోరారు.

ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ మఖిజా మాట్లాడుతూ.గత రెండేళ్లుగా జరిగిన ఆసియా వ్యతిరేక ద్వేషపూరిత నేరాల వరుసలో ఇది మరొకటన్నారు.దక్షిణాసియా సమాజం పట్ల నిందితురాలు ఎస్మెరాల్డా భావాలను తేలికగా తీసుకోకూడాదనని హెచ్చరించారు.చట్టపరమైన ప్రయోజనాల దృష్ట్యా, జాత్యహంకార ద్వేషం కెమెరాలో చిక్కుకున్న నేపథ్యంలో మనమంతా అదృష్టవంతులమని ఆయన అన్నారు.