నిధుల దుర్వినియోగం ఆరోపణలు.. భారత సంతతి కౌన్సిల్ సభ్యురాలి మెడపై ‘‘ రీకాల్‌ ’’ కత్తి

Indian American City Council Member Faces Recall Vote In Seattle

నిధుల దుర్వినియోగానికి సంబంధించి అమెరికాలోని సీటెల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలిగా వున్న భారత సంతతికి చెందిన క్షమా సావంత్‌ ‘‘రీకాల్ ’’ ఓటును ఎదుర్కొంటున్నారు.ఆమె 2014 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు.

 Indian American City Council Member Faces Recall Vote In Seattle-TeluguStop.com

సోషలిస్ట్ ఆల్టర్నేటివ్ సభ్యురాలిగా వున్న ఆమె.అమెరికాలో పబ్లిక్ ఆఫీస్‌కు ఎన్నికైన తొలి, ఏకైక పార్టీ సభ్యురాలు.

క్షమా సావంత్ తన కార్యాలయ అధికారాలను , నిధులను దుర్వినియోగం చేయడం వంటి నాలుగు కారణాలను ఎదుర్కొంటున్నారు.మెరుగైన నగర సేవల కోసం తాము చేసిన అభ్యర్ధనలను ఆమె పట్టించుకోలేదని నల్లజాతీయులు, ఆసియన్లు , యూదులతో కూడిన 70 మంది బృందం నవంబర్ 23న బహిరంగ లేఖలో మండిపడింది.

 Indian American City Council Member Faces Recall Vote In Seattle-నిధుల దుర్వినియోగం ఆరోపణలు.. భారత సంతతి కౌన్సిల్ సభ్యురాలి మెడపై ‘‘ రీకాల్‌ ’’ కత్తి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుప్రీంకోర్టులో ప్రతిపక్షం వేసిన ‘‘రీకాల్’’ దావాపై క్షమా సావంత్ స్పందిస్తూ.రీకాల్ ప్రయత్నం రాజకీయ ప్రేరేపితమని వాదించారు.

అందుచేత పిటిషన్‌ను కొట్టివేయాలని ఆమె కోర్టును కోరారు.అయితే ఏప్రిల్ 2021లో ఆమె తన కార్యాలయ అధికారాన్ని రాజకీయ ఏజెన్సీకి అప్పగించారనే అభియోగం మినహా ప్రతిపక్షం ఆరోపించిన అన్ని రకాల కారణాలపై రీకాల్ నిర్వహించుకోవచ్చని వాషింగ్టన్ సుప్రీంకోర్ట్ తీర్పునిచ్చింది.

రీకాల్ పిటిషన్‌కు సంబంధించి 16,273 సంతకాలను సేకరించారు.డిసెంబర్ 7న సావంత్‌ రీకాల్‌కు సంబంధించి ఓటింగ్ జరగనుంది.

కాగా. ఐటీ ప్రొఫెషనల్ అయిన క్షమా సావంత్ ఆర్ధిక శాస్త్రంపై ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.

ఈ క్రమంలోనే 2012లో వాషింగ్టన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్‌కు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చే సావంత్.కార్మికులు, యువత, అణగారిన వర్గాలకు గొంతుకగా వుంటానన్నారు.అంతేకాదు సీటెల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలిగా తనకు వచ్చే ఆరు అంకెల వేతనానికి గాను.అమెరికాలో సగటు కార్మికుడికి వచ్చే వేతనాన్ని మాత్రమే తీసుకుంటారు.మిగిలిన దానిని సామాజిక న్యాయ ఉద్యమాల నిర్మాణానికి విరాళంగా ఇస్తుంటారు.

కోవిడ్ 19 ఉపశమన చర్యల్లో భాగంగా అమెజాన్ సహా భారీ వ్యాపార సంస్థలపై పన్ను విధించి దానిని శ్రామిక వర్గాల ప్రజల సామాజిక గృహ నిర్మాణ కార్యక్రమాలకు వినియోగించాలని క్షమా సావంత్ పోరాడుతున్నారు.కార్పోరేట్ సంస్థల లాభాల కంటే ప్రజల అవసరాలను దృష్టిలో వుంచుకునే సోషలిస్ట్ సమాజం కోసం పోరాడాలని క్షమా సావంత్ తరచుగా పిలుపునిస్తుంటారు.

#Kshama Sawant #Professional #IndianAmerican #Seattle Council #Corporate

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube