ఆగని సాయం: భారత్‌‌కు బాసటగా ఇండో- అమెరికన్ సెలబ్రెటీలు.. 4,00,000 డాలర్ల విరాళాల సేకరణ

కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న భారతదేశాన్ని ఆదుకునేందుకు ప్రవాస భారతీయులు ముందుకొస్తూనే వున్నారు.వ్యక్తిగత సాయంతో పాటు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో జన్మభూమికి అండగా నిలబడుతున్నారు.

 Indian-american Celebrities Raise $400,000 For Covid-19 Relief In India,  New Yo-TeluguStop.com

ప్రధానంగా దేశాన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, ఇతర వైద్య పరికరాలను విరాళంగా అందజేస్తున్నారు.అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే.

ఇలా ఏ దేశంలో స్థిరపడినప్పటికీ మాతృదేశానికి ఆసరాగా నిలుస్తున్నారు.

ఈ నేపథ్యంలో గతవారం.

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌ నగరంలో ఎన్ఆర్ఐల ఆధ్వర్యంలో నడుస్తున్న గూంజ్ అనే ఎన్జీవో సంస్థ ద్వారా ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ, వారి సన్నిహితుల ద్వారా భారత్‌ కోసం 4,00,000 డాలర్ల విరాళాలను సేకరించారు.న్యూయార్క్ ఫండ్ రైజింగ్ ప్రచారాన్ని భారతీయ ఎన్జీవో సంస్థలైన ఇండియాస్పోరా, 1 బిలియన్ బ్రీత్‌లు సంయుక్తంగా నిర్వహించాయి.

దీనికి కిండ్రెడ్ కిచెన్ పేరు పెట్టాయి.

ఈ సందర్భంగా ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు ఎం.

ఆర్.రంగస్వామి మాట్లాడుతూ.భారత్‌లో కోవిడ్ ఉపశమనానికి సంబంధించి నిధుల సేకరణను కొనసాగించడానికి కిండ్రెడ్ కిచెన్ ఒక కొత్త అవకాశాన్ని అందించిందన్నారు.జీవనోపాధి, ఆహార అభద్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకించి నగరాల నుంచి గ్రామాలకు ఈ సాయం అందాల్సిన అవసరముందున్నారు.

సంపాదించే వ్యక్తి మరణిస్తే.ఆ కుటుంబం పరిస్ధితి ఎలా వుంటుందో ఊహించుకోవడం కూడా కష్టమేనని రంగస్వామి అన్నారు.ChaloGive.org ఫ్లాట్‌ఫాం ద్వారా హెల్ప్ ఇండియా బ్రీత్ విత్ లైఫ్ , హెల్ప్ తమిళనాడు బ్రీత్ తాజాగా కిండ్రెడ్ కిచెన్ వంటి కార్యక్రమాల ద్వారా భారత్‌కు 10 మిలియన్ల సాయం అందించారని .ఇందుకు వారికి రంగస్వామి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రచయిత సుకేతు మెహతా, ప్రసిద్ధ న్యాయవాది ప్రీత్ భరారా పాల్గొన్నారు.

Telugu Basu Ratnam, Kindred Kitchen, Rangaswamy, York, Preet Bharara, Suketu Meh

మెహతా మాట్లాడుతూ.ఇండియాస్పోరా కోవిడ్ సహాయక చర్యల గురించి ప్రస్తావించారు.GoFundMe ద్వారా టామ్ నికోలస్‌ను ఇండియన్ ఫుడ్‌కి పరిచయం చేసి 1,37,000 డాలర్లను వసూలు చేసినట్లు గుర్తు చేశారు.

అమెరికాలోని ధనిక, విద్యావంతులు అధికంగా వున్న సంఘం తమదేనని తెలిపారు.మనతో పాటు మన పూర్వీకులు నివసించిన దేశానికి ఈ క్లిష్ట పరిస్థితుల్లో సాయం చేయాల్సిన అవసరం వుందని మెహతా పిలుపునిచ్చారు.

Telugu Basu Ratnam, Kindred Kitchen, Rangaswamy, York, Preet Bharara, Suketu Meh

న్యూయార్క్‌, మన్‌హట్టన్‌లోని రెస్టారెంట్ యజమాని అయిన బసు రత్నం మాట్లాడుతూ.భారత్‌కు చేయూతను అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా భారతీయ వంటకాలను రుచి చూడటంతో పాటు అమెరికాలోని ప్రవాసులను మరింత దగ్గరికి చేసిందన్నారు.ప్రముఖ మోడల్, రచయిత, టీవీ వ్యాఖ్యాత పద్మాలక్ష్మీ, నటుడు మిండీ కాలింగ్, చెఫ్ నిక్ శర్మ, ప్రియా కృష్ణ, దివంగత ఫ్లాయిడ్ కార్డోజ్ భార్య బర్ఖా కార్డోజ్‌లు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విందుకు సాయం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube