అమెరికా: సాలిస్‌బరీ సిటీ కౌన్సిల్ ఎన్నికల బరిలో భారతీయురాలు.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో

అమెరికా రాజకీయాల్లో భారతీయులు దూసుకెళ్లున్న సంగతి తెలిసిందే.ప్రధాన ఎన్నికలన్నీ ముగియడంతో ప్రస్తుతం దేశంలోని సిటీ కౌన్సిల్ ఎన్నికలపై అందరి దృష్టి పడింది.

 Indian American Businesswoman Nalini Joseph To Run For Salisbury Council , India-TeluguStop.com

వీటిలో కూడా ప్రవాస భారతీయులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.ఇప్పటికే పలువురు ఇండో అమెరికన్లు పోటీలో వున్నట్లు ప్రకటించారు కూడా.తాజాగా సాలిస్‌బరీ సిటీ కౌన్సిల్ ఎన్నికల బరిలో నిలిచారు భారతీయ మహిళ నళిని జోసెఫ్.53 ఏళ్ల ఈ ఇండో అమెరికన్ వ్యాపారవేత్త.నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో గెలిస్తే.ఈ పదవి చేపట్టే తొలి ఇండో-అమెరికన్‌గా చరిత్ర సృష్టించనున్నారు.

ప్రస్తుతం నళిని.గార్డియన్ యాడ్ లైటెమ్‌లో జిల్లా అడ్మినిస్ట్రేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

గత 8 ఏళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు.లీడర్‌షిప్, పరిపాలన విభాగంలో ఆమెకు 20 ఏళ్ల అనుభవం ఉంది.

పిల్లల సంక్షేమం, కుటుంబ సేవల కోసం అడ్వొకసీలో వివిధ ప్రైవేట్, ప్రభుత్వరంగ సంస్థలతో కలిసి పనిచేశారు.పిల్లల కోసం ఎన్జీవో విద్యా సంస్థ విలియం జోన్స్ స్కాలర్స్‌ను కూడా స్థాపించి సమాజ సేవ విషయంలోనూ ముందున్నారు .ప్రస్తుతం సాలిస్‌బరీ నగరంలో ప్రజా భద్రత ప్రధాన సమస్యగా ఉందని నళిని జోసెఫ్ పేర్కొన్నారు.ఈ సమస్య పరిష్కారం కోసం మెరుగైన బడ్జెట్ విధానం ద్వారా చట్ట అమలుతో పాటు, నేరాల రేటును తగ్గించాల్సిన అవసరం ఉందని ఆమె పునరుద్ఘాటించారు.

అటు న్యూయార్క్ సిటీ కౌన్సిల్‌లో 32వ జిల్లా నుంచి భారత సంతతికి చెందిన ఫెలిసియా సింగ్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఆమెకు నిన్న కీలక ఎండార్స్‌మెంట్ సైతం లభించింది.

డెమొక్రాటిక్ నామినీకి సంబంధించి క్వీన్స్‌బరో ప్రెసిడెంట్ డోనోవన్ రిచర్డ్స్ నుంచి ఫెలిసియాకు ఎండార్స్‌మెంట్ దక్కింది.క్వీన్స్‌బరో ప్రెసిడెంట్ డోనోవనన్ రిచర్డ్స్ తనకు మద్ధతు ప్రకటించడం పట్ల ఫెలిసియా సింగ్ హర్షం వ్యక్తం చేశారు.

న్యూయార్క్ 32వ జిల్లా కౌన్సిల్ రేసుపై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ భారీ అంచనాలున్నాయి.ఇక్కడ నమోదిత డెమొక్రాట్లు ఈ జిల్లాలో రిపబ్లికన్ల కంటే 3-1 కంటే ఎక్కువ మంది వున్నారు.

అయితే ఇక్కడి నుంచి రిపబ్లికన్లే ప్రాతినిథ్యం వహిస్తుండటం గమనార్హం.తాజా సెన్సస్ డేటా ప్రకారం.

క్వీన్స్‌లో ఇండో కరేబియన్, లాటినో, పంజాబీ, బంగ్లాదేశ్ కమ్యూనిటీలలో వృద్ధి నమోదైంది.ఇక్కడి నుంచి ఫెలిసియా ఎంపికైతే జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళగా ఆమె రికార్డుల్లోకెక్కుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube