అమెరికా: భారత సంతతి అటార్నీకి కీలక పదవి.. ఎవరీ పవన్ పరీఖ్..?

భారత సంతతి అటార్నీ పవన్ పరీఖ్‌కు అమెరికాలో కీలక పదవి దక్కింది.హామిల్టన్ కౌంటీ క్లర్క్ ఆఫ్ కోర్ట్స్‌గా ఆయన నియమితులయ్యారు.

 Indian American Attorney Pavan Parikh Named Ohios Hamilton County Clerk Of Court-TeluguStop.com

మాజీ జ్యుడీషియల్ అభ్యర్ధి, డెమొక్రాట్ పార్టీకి చెందిన పవన్ ఆర్మీ రిజర్వ్‌లో న్యాయవాదిగా కూడా పనిచేశారు.హామిల్టన్ కౌంటీ క్లర్క్ ఆఫ్ కోర్ట్ పదవిలో కోర్టు రికార్డులను నిర్వహించడం, మునిసిపల్ కోర్టు భద్రతను పర్యవేక్షించడం, ట్రాఫిక్ టికెట్లు, పాస్‌పోర్ట్ దరఖాస్తులను ప్రాసెస్ చేయడం వంటివి వుంటాయి.

పవన్ పరీఖ్ 2022 చివరి వరకు పదవిలో కొనసాగుతారు.నవంబర్ 2022 తిరిగి ఈ పదవికి ఎన్నికలు జరగనున్నాయి.

సిన్సినాటిలో పుట్టిపెరిగిన పరిఖ్ తన జీవితాన్ని ఇతరులకు సేవ చేయడం కోసం అంకితం చేశారు.ప్రిన్స్‌టన్ హైస్కూల్, జేవియర్ యూనివర్సిటీ, సెయింట్ లూయిస్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో విద్యాభ్యాసం చేశారు.

ఉన్నత విద్య అనంతరం జస్టిస్ నాడిన్ అలెన్ ఆధ్వర్యంలో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించాడు.ఓహియో సెనేట్ మైనారిటీ కాకస్‌కు చీఫ్ లీగల్ కౌన్సెల్‌ హోదాలో స్టేట్‌హౌస్‌లో క్రిమినల్ జస్టిస్ రిఫార్మ్స్‌, ఓటింగ్ హక్కులు, రాజ్యాంగాన్ని పర్యవేక్షించడం వంటి బాధ్యతలు నిర్వహించారు.

అనంతరం పవన్ అమెరికా సైన్యంలో న్యాయవాదిగా చేరారు.

అలాగే యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటి కాలేజ్ ఆఫ్ లాలో, జేవియర్ యూనివర్శిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, సిన్సినాటికి చెందిన తరువాతి తరం వ్యక్తులకు మార్గదర్శకత్వం వహించడానికి పరీఖ్ తన సమయాన్ని వెచ్చించాడు.

పాటర్ స్టీవర్ట్ ఇన్ ఆఫ్ కోర్ట్‌లో బారిస్టర్‌లో సభ్యుడిగా, నైరుతి ఒహియోలోని ఆసియా పసిఫిక్ అమెరికన్ బార్ అసోసియేషన్ బోర్డు సభ్యుడిగా, సిన్సినాటి బార్ అసోసియేషన్ వెటరన్స్ అండ్ మిలిటరీ లా కమిటీ వైస్ చైర్‌గా, ఒహియోలో సాధారణ వాలంటీర్‌గానూ పనిచేశారు.

Telugu Aftab Purewal, Pawan Parikh, Brigadierindian, Indianamerican, St Louis, X

ఇంతకుముందు ఈ పదవిలో వున్న అఫ్తాప్ పురేవాల్ కూడా భారత సంతతి వ్యక్తే కావడం విశేషం.ఈయన సిన్సినాటి నగరానికి మేయర్‌గా ఎంపికైన తొలి ఇండో అమెరికన్‌గా రికార్డు సృష్టించాడు.38 ఏళ్ల అఫ్తాబ్ ఒక శరణార్థ టిబెటన్ తల్లి, ఒక భారతీయ తండ్రికి జన్మించాడు.మేయర్ ఎన్నికలలో తన ప్రత్యర్ధి డేవిడ్ మాన్‌నను అఫ్తాబ్ ఓడించాడు.తను ఒక శరణార్ధి కుమారుడినని.తన తల్లి టిబెట్‌లో జన్మించిందని… అనంతరం తన తాతలతో కలిసి స్వదేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందని ఆఫ్తాబ్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.తన తల్లి, తాతలతో కలిసి నేపాల్ ద్వారా హిమాలయాల గుండా భారత్‌లోకి ప్రవేశించారని.

అక్కడ ఆమె శరణార్ధిగా పెరిగిందని ఆయన అన్నారు.తన తల్లి మైసూరు పాఠశాలలో చదువుకుందని అనంతరం ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ చదువుతండగా తన తండ్రిని కలుసుకుందని ఆఫ్తాబ్ చెప్పారు.

తన తండ్రి నాన్న గారు (తాత) ఇండియన్ మిలటరీలో బ్రిగేడియర్‌గా పనిచేశారని ఆయన తెలిపారు.వివాహం తర్వాత ఆఫ్తాబ్ పురేవాల్ తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చి ఒహియోలో స్థిరపడ్డారు.

అక్కడే 1982లో ఆప్తాబ్ జన్మించారు.ఆయన చిన్నతనంలో ఒకసారి టిబెట్‌కు వెళ్లారు.

అయితే ఢిల్లీకి మాత్రం ఎక్కువగా వచ్చేవాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube