న్యూయార్క్: భారతీయ మహిళల అభివృద్ధికి చేయూత... కల్పనా చావ్లా ప్రాజెక్ట్‌లో భాగమైన శిరీష బండ్ల

వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన అంతరిక్ష యాత్రలో పాల్గొన్న భారత సంతతి వ్యోమగామి శిరీష బండ్ల సామాజిక సేవలోనూ తాను ముందుంటాని నిరూపించుకున్నారు.దీనిలో భాగంగా ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను పురస్కరించుకుని కల్పనా చావ్లా ప్రాజెక్ట్ ఫర్ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూరిజం, స్పేస్ స్టడీస్ బోర్డులో శిరీష చేరారు.2003లో కొలంబియా స్పేష్ షటిల్ ప్రమాదంలో మరణించిన కల్పనా చావ్లా జ్ఞాపకార్థం అంతర్జాతీయ అంతరిక్ష విశ్శవిద్యాలయంలో కల్పనా చావ్లా ప్రాజెక్ట్‌ను నెలకొల్పారు.దీని కింద.

 Indian American Astronaut Sirisha Bandla Joins Kalpana Chawla Project, Indian Am-TeluguStop.com

ప్రతిభావంతులైన భారతీయ మహిళలకు బలమైన సాంకేతిక, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తారు.ఈ సందర్భంగా శిరీష బండ్ల మాట్లాడుతూ.

ఈ ప్రాజెక్ట్ అడ్వైజరీ బోర్డులో చేరడం తనకు గౌరవంగా వుందన్నారు.ఇది డాక్టర్ కల్పనా చావ్లాకు మాత్రమే కాకుండా లక్షలాది మంది భారతీయ మహిళలు, బాలికలకు గొప్ప స్పూర్తి అని ఆమె అన్నారు.

ఈ ఏడాది వరల్డ్ స్పేస్ వీక్‌కు ప్రత్యేకత వుందని శిరీష చెప్పారు.

Telugu Sirisha Bandla, Indianamerican, Kalpanachawla, Sirishabandla-Political

కాగా.బండ్ల శిరీష ఫ్యామిలీది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కాగా, ఆమె తల్లిదండ్రులు డాక్టర్ అనురాధ, డాక్టర్ మురళీధర్‌రావు చాలా ఏళ్ల క్రితమే వీరి కుటుంబం అమెరికాలోని స్థిరపడ్డారు.అక్కడే ఏరోస్పేస్ అండ్ ఆస్ట్రో నాటికల్ ఇంజనీరింగ్లో శిరీష పట్టా సంపాదించారు.జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన అనంతరం.2015 నుంచి వర్జిన్ గెలాక్టిక్లో పలు కీలక బాధ్యతలను శిరీష నిర్వహిస్తున్నారు.

జూలై 11న వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన వీఎస్ఎస్ యూనిటీ 22 ద్వారా రిచర్డ్ బ్రాన్‌సన్ తన బృందంతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు.సుమారు 90 నిమిషాల పాటు రోదసీలో గడిపి విజయవంతంగా భూమిని చేరారు.

ఈ బృందంలో శిరీష బండ్ల కూడా వున్నారు.తద్వారా అంతరిక్షయానం చేసిన రెండవ భారత సంతతి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో వర్జిన్ గెలాక్టిక్ పేరు మారుమోగుతోంది.అంతేకాదు త్వరలోనే మరికొందరిని అంతరిక్షంలోకి పంపేందుకు ఈ సంస్థ బుకింగ్స్‌ కూడా చేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube