అమెరికా: బైడెన్ కొలువులోకి మరో ఇండో అమెరికన్.. వాణిజ్య విభాగంలో కీలకపదవి

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పరిపాలనా యంత్రాంగంలో భారతీయులు, భారత సంతతి వ్యక్తులు కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా బైడెన్ మాత్రం ఇండో అమెరికన్ల సత్తాపై నమ్మకం వుంచి వారికే అత్యున్నత పదవులు కట్టబెడుతున్నారు.

 Indian-american Appointed As Chief Operating Officer Of Us Trade Agency , Joe Bi-TeluguStop.com

కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చిన బైడెన్ మళ్లీ ఇటీవలి కాలంలో భారతీయ అమెరికన్లను కీలకపదవుల్లో నియమిస్తూ వస్తున్నారు.తాజాగా.

భారత సంతతికి చెందిన మాజీ దౌత్యవేత్త వినయ్ తుమ్మలపల్లిని యూఎస్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (యూఎస్‌టీడీఏ) డిప్యూటీ డైరెక్టర్‌గా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌‌గా నియమించారు.ఈ నియామకానికి ముందు వినయ్‌… 2013 నుంచి 2017 వరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌లో సెలెక్ట్ యూఎస్ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

అంతేకాదు వినయ్ .అమెరికా చరిత్రలో అంబాసిడర్‌గా విధులు నిర్వర్తించిన తొలి అంబాసిడర్‌గా చరిత్ర సృష్టించాడు.2009 నుంచి 2013 వరకు బెలిజ్‌లో అమెరికా అంబాసిడర్‌గా విధులు నిర్వహించారు.

కాగా.

తుమ్మలపల్లికి ప్రైవేట్ రంగంలో దాదాపు 30 ఏళ్ల అనుభవం వుంది.వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్న ప్రజా వ్యవహారాలు, ప్రభుత్వ సంబంధాల సంస్థ రెడ్ ఫోర్ట్ స్ట్రాటజీస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా.

ఎంఏఎం ఏ సంస్థ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు.సెనేట్ ద్వారా వినయ్ తాజా నియామకం ఆమోదం పొందేవరకు యూఎస్‌టీడీఏ యాక్టింగ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఆయన విధులు నిర్వహిస్తారని యూఎస్‌టీడీఏ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

మరోవైపు ఇండియన్-అమెరికన్ రవి చౌదరిని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌లో కీలక పదవికి నామినేట్ చేస్తున్నట్లు జో బైడెన్ గత వారం ప్రకటించారు.రవి చౌదరి గతంలో యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో ఆఫీసర్‌గా పనిచేశారు.

తాజాగా ఆయనను ఎయిర్‌ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ఫర్ ఇన్‌స్టాలేషన్స్‌గా బైడెన్ నామినేట్ చేశారు.ఈ కీలకమైన పెంటగాన్ పదవిలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు యూఎస్ సెనేట్ రవి నామినేషన్‌ను ధ్రువీకరించాల్సి వుంది.

రవి చౌదరి గతంలో అమెరికా రవాణా శాఖలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.అంతేకాకుండా ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ)లోని కమర్షియల్ స్పేస్ ఆఫీస్‌లో డైరెక్టర్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ అండ్ ఇన్నోవేషన్‌గానూ విధులు నిర్వర్తించారు.

ఈ హోదాలో ఎఫ్ఏఏ కమర్షియల్ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ మిషన్‌కు మద్ధతుగా అధునాతన అభివృద్ధి, పరిశోధన కార్యక్రమాల అమలును పర్యవేక్షించారు.రవాణా శాఖలో విధులు నిర్వర్తించే సమయంలో దేశవ్యాప్తంగా వున్న తొమ్మిది ప్రాంతాలలో విమానయాన కార్యకలాపాల ఏకీకరణ కోసం రీజియన్స్ అండ్ సెంటర్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube