ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకుపోతున్న భారత ఆల్‌ రౌండర్లు..!

క్రికెట్ రంగంలో మన కుర్రాళ్లు దూసుకెళ్తున్నారు.అంతర్జాతీయంగా ర్యాంకింగ్స్ లో ముందంజ వేస్తూ తమ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు.

 Indian All Rounders Soaring In Icc Rankings-TeluguStop.com

ఆల్ రౌండర్ల జాబితాలో కూడా మనవాళ్లే మొదటి స్థానంలో ఉండటం విశేషం.భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.

తాజాగా ఐసీసీ ఆల్ రౌండర్ల జాబితాను ఐసీసీ ప్రకటించింది.ఆల్ రౌండర్ విభాగంలో జడేజా మొదటి స్థానంలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.

 Indian All Rounders Soaring In Icc Rankings-ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకుపోతున్న భారత ఆల్‌ రౌండర్లు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫస్ట్ టైమ్ 2017లో మొదటి స్థానంలో జడేజా కొనసాగడం విశేషం.మళ్లీ ఇప్పుడు మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు అయిన జాసన్ హోల్డర్‌ ను దాటి మొదటి స్థానంలో తిరిగి గొనసాగుతున్నాడు.దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య 2 మ్యాచ్‌లు జరిగాయి.

ఈ టెస్ట్ సిరీస్ పూర్తయ్యిన తర్వాత ఐసీసీ ఆల్ రౌండర్ల జాబితాను ప్రవేశపెట్టింది.ఈ క్రమంలో రవీంద్ర జడేజా మొదటి స్థానాన్ని కైవశం చేసుకున్నాడు.రవీంద్ర జడేజా 2017లో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కూడా తన సత్తా చాటాడు.బౌలింగ్, ఆల్ రౌండర్ల జాబితాలో మొదటి స్థానాన్ని కైవశం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

మళ్లీ ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత జడేజా తన స్థానానికి తాను చేరుకోవడం విశేేషం. జాసన్ హోల్డర్ 412 పాయింట్లతో ఇప్పటి వరకు ఆల్ రౌండర్ల జాబితాలో ముందుగానే ఉన్నాడు.

అయితే నేడు ప్రకటించిన ఫలితాల్లో 28 పాయింట్లు దిగజారాడు.దీంతో ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా 386 పాయింట్లు కొనసాగుతుండటంతో మొదటి స్థానంలో నిలిచాడు.ఆ తర్వాత హోల్డర్ 384 పాయింట్లతో రెండో ప్లేస్ లో ఉన్నాడు.ఇక మూడవ స్థానంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ నిలిచాడు.ఆ తర్వాత నాలుగవ స్థానంలో టీమిండియా మరో స్పిన్నర్ అశ్విన్ కొనసాగుతున్నాడు.ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో జడేజా 16, అశ్విన్ 2వ స్థానంలో ఉన్నారు.

#Sports #ICC Ranking #Players #Sports Updates #Team

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు