భారతీయుడు 2 జూన్ లో మళ్ళీ సెట్స్ పైకి! తేల్చి చెప్పిన నిర్మాతలు  

మళ్ళీ భారతీయుడు 2 జూన్ లో సెట్స్ పైకి వెళ్తుందంట. .

Indian 2 Movie Going To Sets In June-going To Sets In June,indian 2 Movie,kamal Haasan,telugu Cinema,tollywood

దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో కమల్ హసన్ హీరోగా వచ్చిన భారతీయుడు ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాకి మళ్ళీ ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించడానికి రెడీ అయ్యి ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ చేసారు. అయితే ఈ సినిమా లైకా ప్రొడక్షన్ నిర్మిస్తూ ఉండగా సోషల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న దీనిని శంకర్ మరల భారీ బడ్జెట్ తోనే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది..

భారతీయుడు 2 జూన్ లో మళ్ళీ సెట్స్ పైకి! తేల్చి చెప్పిన నిర్మాతలు-Indian 2 Movie Going To Sets In June

ఇక ఈ సినిమాలో కాజల్ ఓ కీలక పాత్రలో కనిపిస్తూ ఉండగా, సిద్దార్ద్, శింబు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ మొదలెట్టిన తర్వాత ఏవో కారణాల వలన మరల షూటింగ్ అర్ధంతరంగా ఆగిపోయింది. లైకా ప్రొడక్షన్ తో ఆర్ధిక సంబంధమైన విభేదాల కారణంగా దర్శకుడు శంకర్ సినిమాని ఆపేసినట్లు వార్తలు వచ్చాయి.

అదే సమయంలో కమల్ హసన్ కూడా రాజకీయంగా బిజీ కావడంతో సినిమా ముందుకి కదలలేదు. ఈ నేపధ్యంలో సినిమా ఆగిపోయిందనే టాక్ గత కొంత కాలంగా వినిపిస్తుంది. తాజాగా కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సినిమా ఆగిపోలేదని, దర్శకుడు శంకర్, నిర్మాతల మధ్య ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అయినట్లు తెలుస్తుంది.

అన్ని సెట్ చేసుకొని జూన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం.