తాత మళ్లీ లేటే వస్తాడట!  

Indian 2 Movie Postponed Again-kajal Aggarwal,kamal Hassan,release Date,shankar

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్-2 సినిమాలో బిజీగా ఉన్నాడు.ఇది ఇండియన్(భారతీయుడు) సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు శంకర్ రెడీ అయ్యాడు.కమల్ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకొని చాలా రోజులు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

Indian 2 Movie Postponed Again-Kajal Aggarwal Kamal Hassan Release Date Shankar

అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్‌ నుండి ఇప్పటికి వరకు ఎలాంటి స్సష్టమైన అనౌన్స్‌మెంట్ రాలేదు.ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే మొదలుపెట్టిన శంకర్, ఈ ఏడాది నాటికి అన్ని పనులు ముగించుకుని సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు.

కానీ సినిమా షూటింగ్‌ చాలా ఆలస్యమవుతుందని, అందుకే రిలీజ్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

ఇక ఇండియన్ 2 సినిమాను ఎక్కడా రాజీ పడకుండా 2021 సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు దర్శకుడు శంకర్, నిర్మాణ కంపెనీ లైకా ప్రొడక్షన్స్ నిర్ణయించుకున్నాయి.

అంటే తాతను చూడాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీసింహా, సముదిర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు

Indian 2 Movie Postponed Again-kajal Aggarwal,kamal Hassan,release Date,shankar Related....