ఇండియన్ 2పై కమల్ కామెంట్..!

శంకర్ డైరక్షన్ లో కమల్ హాసన్ హీరోగా పాతికేళ్ల తర్వాత సూపర్ హిట్ సీక్వల్ గా ఇండియన్ 2 గ్రాండ్ గా మొదలుపెట్టారు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మొదలైన నాటి నుండి ఏదో ఒక విధంగా సమస్యలు వస్తూనే ఉన్నాయి.

 Indian 2 Kamal Hassan Crazy Comments , Bharateeyudu, Indian2, Kamal, Kamal Hassa-TeluguStop.com

షూటింగ్ టైం లో క్రేన్ యాక్సిడెంట్ సినిమా మీద బాగా ఎఫెక్ట్ పడేలా చేసింది.ఇక శంకర్ తో లైకా ఫైనాన్షియల్ ఫైట్స్ సినిమాను ఆగిపోయేలా చేశాయి.

ఇండియన్ 2 ని అర్ధాంతరంగా ఆపేసి రాం చరణ్ తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు శంకర్.ఇండియన్ 2 దాదాపు క్యాన్సల్ అయినట్టే అని అనుకున్నారు కాని లేటెస్ట్ గా ఇండియన్ 2 సినిమాపై స్పందించి ఫ్యాన్స్ కు మళ్లీ ఆశలు కలిగేలా చేశాడు కమల్ హాసన్.

ఇండియన్ 2 సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందన్న విషయాన్ని వెల్లడించారు కమల్ హాసన్.అంతేకాదు ఈ సినిమా త్వరలోనే మళ్లీ సెట్స్ మీదకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం విక్రం తో కమల్ ఒక సినిమా చేస్తున్నారు.ఆ సినిమా తర్వాత శంకర్ తో ఇండియన్ 2 మళ్లీ సెట్స్ మీ

దకు

తీసుకెళ్తారని తెలుస్తుంది.

కమల్ మధ్యలో ఉండి మిగతా గొడవలన్ని పరిష్కరిస్తున్నట్టు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube