విండీస్‌పై భారత్‌ ఘన విజయం, సిరీస్‌ కైవసం

టీం ఇండియా జోరు కొనసాగుతోంది.వెస్టిండీస్‌పై మరో సిరీస్‌ను కైవసం చేసుకుంది.టీ20 సిరీస్‌ ను 2-1 తేడాతో నెగ్గి ట్రోఫీని పట్టుకుంది.మొదటి మ్యాచ్‌లో ఇండియా గెలువగా రెండవ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ విజయం సాధించింది.

 India Won The Match-TeluguStop.com

కీలకమైన మూడవ మ్యాచ్‌లో టీం ఇండియా ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ.రోహిత్‌ శర్మ.

కేఎల్‌ రాహుల్‌ లు రెచ్చి పోయి మరీ హాఫ్‌ సెంచరీలు చేయడంతో వెస్టిండీస్‌కు పరాభవం తప్పలేదు.

ఈ విజయంతో టీం ఇండియా విజయాల పరంపర కొనసాగుతోంది.

ఎప్పటిలాగే విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.ఓపెనర్లు ఇద్దరు కూడా భారీ పరుగులు చేయడంతో ఇండియా విజయం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది.టీం ఇండియా ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ 71, రాహుల్‌ 91 మరియు కోహ్లీ 70 పరుగులు చేశారు.

రాహుల్‌ మరియు కోహ్లీలు నాటౌట్‌గా నిలిచారు.ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ జట్టు నిర్ణీత 241 పరుగుల లక్ష్యంను ఛేదించలేక పోయింది.8 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే వెస్టిండీస్‌ చేయగలిగింది.

#IndiaWon #India #Rohith Sharma #Polard #KL Rahul

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు