వైరల్ వీడియో: బౌండరీ లైన్ దగ్గర సూపర్ క్యాచ్ అందుకున్న టీమిండియా ఉమెన్..!

క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.సినిమా వాళ్ల కంటే ఎక్కువగా క్రికెటర్లకు అభిమానులుంటారు.

 India Women Cricketer Harleen Deol Takes A Jaw Dropping Catch Against England ,-TeluguStop.com

ఇక ఐపిఎల్ వచ్చిందంటే చాలు.జనాలు టీవీలకు అతుక్కుపోతారు.

మరి మ్యాచ్ లో సిక్సులు, ఫోర్లు కొడితే జనాలు కేరింతలు కొడుతూ విజిల్స్ వేస్తూ ఎంతో సంబరపడిపోతారు.తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

అయితే మహిళల క్రికెట్ మ్యాచ్ లో ఆ ఘటన జరిగింది.కనీవినీ ఎరగని రీతిలో ఓ మహిళా క్రికెటర్ క్యాచ్ పట్టింది.

ఆ క్యాచ్ ను ఎవ్వరూ ఊహించనే లేదు.బౌండరీ లైన్ వద్ద ఆమె చేసిన విన్యాసాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.

టీమిండియా యువ క్రికెటర్ హర్లీన్ డియోల్ పట్టిన ఆ క్యాచ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది.అమ్మాయిల ఫిట్‌నెస్‌ను చాటిచెప్పే విధంగా ఆ క్రికెటర్ పట్టిన క్యాచ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఆమె క్యాచ్ పట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.

ప్రస్తుతం భారతదేశ మహిళల టీమ్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది.

వన్డే మ్యాచ్ లు జరిగిపోయాయి.ప్రస్తుతం టీమిండియా, ఇంగ్లండ్ మధ్యన టీ20 మ్యాచ్ లు జరుగుతున్నాయి.

అయితే నార్తాంప్టన్ వేదికగా మొదటి టీ20 మ్యాచ్‌ జరిగింది.అందులో హర్లీన్ డియోల్ అద్భుతం ప్రదర్శన ఇచ్చింది.

ఈ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్‌కి దిగిన ఇంగ్లండ్ జట్టు బౌండరీలు చేసి చెమటలు పట్టించింది.

ఆ సమయంలో బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తోన్న హర్లీన్ డియోల్ కనివినీ ఎరుగని రీతిలో క్యాచ్ ను పట్టి అందర్నీ ఔరా అనిపించింది.గాల్లోకి డైవ్ చేసి క్యాచ్ ను పట్టింది.ఈ నేపథ్యంలో బౌండరీలకు అవతల వైపు పడిపోతానని ఆమె గమనించింది.

అందుకే బంతిని గాలిలోకి విసిరేసింది.మళ్లీ బౌండరీ ఇవతలికి వెళ్లింది.

బంతిని డైవ్ చేసి మరీ పట్టుకుంది.ప్రస్తుతం ఆమె అందుకున్న క్యాచ్ కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube