బోణీ కొట్టిన భారత్.. తొలి టీ20లో విండీస్‌పై విజయం

భారత్ టూర్‌లో భాగంగా విండీస్‌ జట్టు ఇండియాతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడుతున్న నేపథ్యంలో, శుక్రవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు విండీస్ ఆటగాళ్లు చుక్కలు చూపించారు.

 India Wins 1st T20 Against West Indies-TeluguStop.com

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు బ్యాట్స్‌మెన్లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.విండీస్ ఓపెనర్ సైమన్స్(2) త్వరగా ఔట్ అయినా కూడా అటుపై ఆటను ఎవిన్ ల్యూవిస్(40), బ్రాండన్ కింగ్(31), షిమ్రన్ హెట్మర్(56) పరుగులు చేసి విండీస్ స్కోరును పరిగెత్తించారు.ఇక చివర్లో వచ్చిన పొలార్డ్(37), జేసన్ హోల్డర్(24) మెరుపు ఇన్నింగ్స్‌తో విండీస్ స్కోరు 200 దాటింది.

208 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లలో రోహిత్ శర్మ(8) నిరాశపరిచాడు.కానీ కోహ్లీ(94 నాటౌట్) నిలకడగా ఆడుతూనే బంతిని బౌండరీలకు పంపించాడు.అటు మరో ఓపెనర్ రాహుల్(62) కూడా కోహ్లీకి తోడుగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.వీరిద్దరు కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.130 పరుగుల వద్ద రాహుల్ ఔట్ కావడంతో రిషబ్ పంత్(18) సహాయంతో కోహ్లీ జట్టును విజయానికి చేరువకు తీసుకువచ్చాడు.18.4 ఓవర్లలోనే కోహ్లీ దూకుడుకు భారత్ విజయతీరాలను చేరుకుంది.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube