లాక్ డౌన్ మరో వారం పొడిగింపు ? కారణం ఇదేనా...?

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి.కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని డబ్ల్యూహెచ్ఓ జారీచేసిన మార్గదర్శకాల్లో ఉండడంతో దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించింది.

 Coronavirus Crisis, Extend Lockdown, Pm Modi, Who, Central Health Department-TeluguStop.com

ఒక్కరోజుతో ఈ లాక్ డౌన్.ముగుస్తుంది అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా లాక్ డౌన్ ను 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది.

మార్చి 22వ తేదీన నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కేంద్రం అమల్లోకి తెచ్చింది.అయితే అప్పటికే విదేశాల నుంచి వచ్చే విమానాలు సైతం ఆగిపోయాయి.21 రోజుల లాక్ డౌన్ ద్వారా దేశంలో పూర్తిగా కరోనా ను నిర్మూలించవచ్చు కేంద్రం భావించింది.అయితే అకస్మాత్తుగా ఢిల్లీలోని మార్కస్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కారణంగా కేంద్ర ప్రభుత్వం వ్యూహం పూర్తిగా దెబ్బతింది.

డిల్లీ ప్రార్థనకు వెళ్లిన వారిలో 16 రాష్ట్రాలకు చెందిన వారు ఉండడం, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బయటపడిన పాజిటివ్ కేసులలో 30 శాతం పైగా వీరి ద్వారానే కావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి.మత ప్రార్థనలకు వెళ్లిన వారి వివరాలు బయటకు రాకముందు కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో పెద్దగా కనిపించలేదు.

కానీ వారి విషయం బయట పడిన తర్వాత పెద్ద ఎత్తున కేసుల సంఖ్య పెరగడం, అప్పటికే వారి ద్వారా అనేక మందికి ఈ వైరస్ సోకడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది.ఇప్పటికే తాబ్లిగి సమ్మేళనానికి వెళ్ళిన వారు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదు.

కొంత మంది ఆచూకీ కూడా ఇప్పటికి దొరకలేదు.అలాగే వారి కుటుంబ సభ్యుల నుంచి, వారి వర్గం వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

వారికి పరీక్షలు నిర్వహించేందుకు వెళ్తున్న వైద్య సిబ్బంది పైన దాడులు చేస్తుండడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీన లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో మరో వారం రోజులు గడువు పొడిగిస్తే మంచిది అన్నట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీ కి సూచించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆయన మరో కొద్దిరోజుల్లో లాక్ డౌన్ పొడిగింపు పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సూచనలను ప్రధాని పాటిస్తే మరో వారం రోజుల పాటు ప్రజలకు లాక్ డౌన్ ఇబ్బందులు తప్పకపోవచ్చు.

Coronavirus crisis, extend lockdown, PM Modi, Who, central health department

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube