అదే మైదానంలో మరో పోరుకు సిద్దమైన టీమిండియా ఈసారి విండీస్ తో  

India Vs West Indies Match Will Starts Soon-india Vs West Indies,pakisthan,rohith,start Soon,virat Kohili,world Cup Match,ఐసీసీ ప్రపంచ కప్,టీమిండియా-వెస్టిండీస్

ఐసీసీ ప్రపంచ కప్ లో భాగంగా టీమిండియా ఈ రోజు మరో పోరుకు సిద్ధమైంది. ఆఫ్ఘన్ తో అతి కష్టం మీద గెలిచిన టీమిండియా ఈ రోజు వెస్టిండీస్ తో తలపడనుంది. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ లలో గెలిచిన టీమిండియా 9 పాయింట్లు సాధించింది. అయితే మరోపక్క విండీస్ జట్టు మాత్రం ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడి నాకౌట్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది..

అదే మైదానంలో మరో పోరుకు సిద్దమైన టీమిండియా ఈసారి విండీస్ తో -India Vs West Indies Match Will Starts Soon

ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న రోహిత్‌, విరాట్ కోహ్లీల నుంచి భారత్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. పాక్‌తో మ్యాచ్‌లో తడబడ్డ ప్రధాన పేసర్‌ బుమ్రా. అఫ్గాన్‌పై తన బౌలింగ్‌ వాడి చూపించడం సానుకూలాంశం. ఆ మ్యాచ్‌లో ఆడిన షమి కూడా సత్తా చాటాడు. స్పిన్నర్లు నిలకడగానే రాణిస్తున్నారు.

ఇక, పాకిస్థాన్‌తో భారత్‌ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ స్టేడియమే వెస్టిండీస్‌తో పోరుకు వేదిక కాబోతుండడం మరో అనుకూల అంశం అని చెప్పాలి. గతంలో ఆ పిచ్ లో ఆడిన అనుభవం కూడా ఉండడం తో టీమిండియా కు విజయావకాశాలు ఎక్కువ అని చెప్పాలి.

ఇప్పటి వరకు టీమిండియా-వెస్టిండీస్ మొత్తంగా 126 మ్యాచ్‌లలో తలపడగా 59 మ్యాచ్‌ల్లో భారత్‌, 62 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ విజయం సాధించాయి. ఇక వరల్డ్ కప్‌ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 8 సార్లు తలపడగా 5 మ్యాచ్‌ల్లో టీమిండియా, 3 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ గెలుపొందాయి. అయితే ఈ సారి ప్రపంచ కప్ లో భాగంగా విండీస్-టీమిండియా జట్ల లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

మరికొద్దిసేపటిలో ఈ మ్యాచ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.