ఇండియా VS సౌతాఫ్రికా: టీమిండియా ఈసారైనా గెలుపు సాధిస్తుందా..

నేడు అంటే డిసెంబర్ 26 మధ్యాహ్నం 1:30 గంటలకు టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది.తొలి టెస్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ వేదికగా ఆరంభం కానుంది.

 ఇండియా Vs సౌతాఫ్రికా: టీమిండియ�-TeluguStop.com

ఈ కీలక సమరంలో టీమిండియా గెలుస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.ఈ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కచ్చితంగా నెగ్గాలని టీమిండియా సన్నద్ధమైంది.

రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ టాలెంటెడ్ ప్లేయర్లు విలువైన మెళకువలను నేర్చుకున్నారు.అభిమానులు కూడా ఈసారి టీమిండియాకి గెలుపు తధ్యమని అభిప్రాయపడుతున్నారు.

దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్‌లో కాస్త బలహీనంగా ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.దీంతో విదేశీ గడ్డపై సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.నిజానికి ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్‌ను గెలిచిన దాఖలాల్లేవు.1992 నుంచి దక్షిణాఫ్రికాలో భారత్ ఏడుసార్లు పర్యటించింది.కానీ ఏ ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్‌ను నెగ్గలేకపోయింది.దీనికి కారణం సొంతగడ్డలోని మైదానాలు సౌతాఫ్రికా జట్టుకు కలిసి రావడమే! ప్రతికూల బాహ్య అంశాలకు ఎదురొడ్డి టీమ్ఇండియా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లతో జరిగిన మ్యాచుల్లో రాణించింది.

అదే తరహాలో సౌతాఫ్రికాని కూడా చిత్తుచేయాలని కోహ్లీసేన భావిస్తోంది.

ఈసారి విరాట్ కోహ్లీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ టెస్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడంతో కోహ్లీ మెరుగైన ఆట ప్రదర్శన కనబర్చడం తప్పనిసరిగా మారింది.గత కొంత కాలంగా ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయిన కోహ్లీ ఈసారైనా తన ఆటపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానం చెప్తాడో లేదో చూడాలి.

Telugu India Africa, Africa, India-Latest News - Telugu

ఓపెనర్లు అయిన రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ గాయాల కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.దీంతో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌, మయాంక్ అగర్వాల్‌ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు.వీరు ఓపెనర్లయితే.మూడవ బ్యాటింగ్ ఆర్డర్​లో కెప్టెన్‌ కోహ్లీ ఉన్నాడు.బ్యాటర్ పుజారా 4వ ఆర్డర్​లో ఆడే అవకాశం ఉంది.విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ శ్రేయస్ అయ్యర్ లేదా సీనియర్ ప్లేయర్ అజింక్య రహానె 5వ ఆర్డర్​లో ఆడొచ్చు.

శార్దుల్ ఠాకూర్‌ కూడా తొలి ఆర్డర్​లోనే బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువ.ఇక బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా, షమి, సిరాజ్‌, అశ్విన్‌లు మెరుగైన ఆట ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది.

వికెట్ కీపర్‌గా పంత్ వ్యవహరించనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube