బంగ్లాదేశ్ తో పోరు గెలిస్తేనే సెమీస్ ఆశలు  

India Vs Bangladesh World Cup Match Starts Soon-england,icc,india,semi Final Qualification Match,world Cup Match

ఐసీసీ ప్రపంచ కప్ 2019 టోర్నీ లో ఈ రోజు టీమిండియా బంగ్లాదేశ్ తో పోరాడడానికి సిద్ధమైంది. ఈ టోర్నీ ప్రారంభం నుంచి వరుస విజయాలను నమోదు చేసుకుంటూ వస్తున్న టీమిండియా ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు బంగ్లా తో జరగబోయే ఈ మ్యాచ్ లో టీమిండియా పక్కా ప్రణాళిక తో ఆడాలని నిర్ణయించుకుంది. బంగ్లాదేశ్ ని తక్కువా అంచనా వేయకూడదు అని అందుకే ఈ జట్టుపై విజయాన్ని అందుకోవడం కోసం టీమిండియా పక్కా అస్త్రాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది..

బంగ్లాదేశ్ తో పోరు గెలిస్తేనే సెమీస్ ఆశలు -India Vs Bangladesh World Cup Match Starts Soon

ఈ క్రమంలోనే ముగ్గురు సీమర్ల ను ఆడించే యోచన లో ఉంది కోహ్లీ సేన.

మరోపక్క ఈ టోర్నీ ఆది నుంచి మంచి పోరాట పటిమ ప్రదర్శిస్తూ తోలి మ్యాచ్ లోనే దక్షిణాఫ్రికా కు షాకిచ్చి, అలానే వెస్టిండీస్ ను కూడా మట్టి కురిపించిన బంగ్లా జట్టు ఇక ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా నెగ్గాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ మ్యాచ్ లో బంగ్లా జట్టు విజయాన్ని అందుకుంటేనే ఆ జట్టు సెమీస్ ఆశలు సజీవంగా నిలుస్తాయి.

లేదంటే ఈ టోర్నీ నుంచి బంగ్లా నిష్క్రమించినట్లే. ఈ క్రమంలో టీమిండియా భారీ కసరత్తులు చేస్తుంది. లోయర్ ఆర్డన్ పటిష్ఠం చేసేందుకు చాహల్‌ను తప్పించి భువనేశ్వర్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి.

ఇక, ఈ టోర్నీలో ఏ మాత్రం ప్రభావం చూపని కేదార్ జాదవ్‌ను కూడా పక్కనబెట్టి. ఆల్ రౌండర్ జడేజాను తీసుకోవాలన్నా యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.

మరోపక్క బంగ్లా జట్టు లో కూడా మహ్మదుల్లా, షకీబుల్ హాసన్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం కాగా… బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న షకీబుల్ హాసన్ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ కూడా ఫామ్‌లోకి వస్తే ఆ జట్టు భారీ స్కోరు చేయడానికైనా, లక్ష్యాన్ని ఈజీగా ఛేదించడానికైనా అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, బౌలింగ్ వీక్‌గా ఉండటం ఆ జట్టును వేధిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బర్మింగ్‌హామ్‌ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్టులు ఆదివారం తలపడిన పిచ్ మీద భారత్-బంగ్లా జట్లు తలపడనున్నాయి.