నేడు భారత్ వర్సెస్ ఆఫ్గాన్ తోలి టీ20 మ్యాచ్.. పసికూనపై భారత్ విజృంభిస్తుందా..!

భారత్ వేదికగా భారత్-ఆఫ్ఘనిస్తాన్( India, Afghanistan ) మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు మొహలీ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.టీ20 ప్రపంచ కప్ కు ముందు ఆఖరి టీ20 సిరీస్ ఇదే కావడం వల్ల భారత్ ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని బరిలోకి దిగనుంది.

అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టును పసికూన జట్టని తక్కువ అంచనా వేయలేం.

ఆఫ్ఘనిస్తాన్ తో పోలిస్తే భారత జట్టు చాలా బలంగా ఉంది.కానీ ఎటువంటి జట్టునైనా ఓడించగలిగే సత్తా ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది.ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ లో ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక లాంటి బలమైన జట్లను ఆఫ్ఘనిస్తాన్ మట్టికరిపించింది.

వన్డే ఫార్మాట్ తో పోలిస్తే టీ20 ఫార్మాట్ లో ఆఫ్గనిస్తాన్ మరింత ప్రమాదకర జట్టుగా కొనసాగుతోంది.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా జరిగే పలు లీగ్ లలో ఆడుతుండడమే దీనికి ప్రధాన కారణం.బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుత ఆట ప్రదర్శించగల సత్తా ఉండే ఆటగాళ్లు ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఉన్నారు.అందుకే టీ20 సిరీస్ గెలుస్తామనే భారీ ఆశలతో ఆఫ్ఘనిస్తాన్( Afghanistan ) సిరీస్ కు సిద్ధమైంది.

Advertisement

మరి ఇలాంటి ఆఫ్గనిస్తాన్ జట్టును భారత్ ఓడించడం కాస్త కష్టమే.భారత్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో కాస్త ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది.భారత జట్టుకు సొంత గడ్డపై సిరీస్ జరగడం కలిసి వచ్చే అంశమే.

అలా అని ఆఫ్గనిస్తాన్ ను తేలికగా తీసుకుంటే భారత జట్టు తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.

టీ20 సిరీస్ ఆడే భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్ మన్ గిల్( Shubman Gill ), తిలక్ వర్మ, రింకు సింగ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, జితేష్ శర్మ, సుందర్, రవి బిష్ణోయి, శివం దూబే.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు