Indo - US Joint Training Exercise : ఈ ఏడాది ఉత్తరాఖండ్ వేదికగా భారత్ - అమెరికాల సంయుక్త సైనిక విన్యాసాలు..!!

భారత్ అమెరికాల మధ్య అనుబంధం ఇటీవలికాలంలో పెరుగుతోన్న సంగతి తెలిసిందే.రక్షణ, ఆర్ధిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి.

 India-us Joint Military Exercise 'yudh Abhyas' Slated To Start November 16 At Ut-TeluguStop.com

ఇక భారత్ సైనికపరంగా ఎదిగేందుకు అగ్రరాజ్యం సాయం చేస్తోంది.దీనిలో భాగంగా ఇండో యూఎస్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ 18వ ఎడిసన్ ‘‘ యుధ్ అబ్యాస్ 2022’’ ఈ రోజు నుంచి ఉత్తరాఖండ్‌లో జరగనుంది.

అత్యుత్తమ అభ్యాసాలు, వ్యూహాలు, పద్దతులు, విధానాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది భారత్ – అమెరికాల మధ్య డ్రిల్ నిర్వహిస్తూ వస్తున్నారు.ఈ కార్యక్రమం గతేడాది అక్టోబర్‌లో అలాస్కాలోని జాయింట్ బెస్ ఎల్మెండోర్ఫ్ రిచర్డ్‌సన్‌లో నిర్వహించారు.
ఈ ఏడాది విన్యాసాలకు సంబంధించి 11వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌లోని సెకండ్ బ్రిగేడ్‌‌కు చెందిన యూఎస్ ఆర్మీ సైనికులు, అస్సాం రెజిమెంట్‌‌కు చెందిన ఇండియన్ ఆర్మీ సైనికులు పాల్గొంటారు.ఐక్యరాజ్యసమితి నియమావళిలోని ఛాప్టర్ VII క్రింద .శాంతి భద్రతలు, శాంతి పరిరక్షణకు సంబంధించిన కార్యకలాపాలను కూడా ఈ కార్యక్రమంలో అమలు చేయనున్నారు.ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు ఇరు దేశాల సైనికులు కలిసి పనిచేస్తారు.

జాయింట్ ఎక్సర్‌సైజ్, మానవతా సాయం, విపత్తు సహాయ కార్యకలాపాలపైనా దృష్టి పెట్టనున్నారు.ఈ కసరత్తు ద్వారా ఇరుదేశాల సైన్యాలు తమ విస్తృత అనుభవాలను పంచుకోవడానికి, సమాచార మార్పిడి ద్వారా సాంకేతికతను మెరుగుపరచడానికి వీలు కలుగుతుంది.

Telugu India Military, Indo Exercise, November, Uttarakhand, Yudh Abhyas-Telugu

భారత్ – అమెరికాల మధ్య ఉమ్మడి ట్రైనింగ్ 2004 నుంచి కొనసాగుతోంది.కానీ ఈసారి ఉత్తరాఖండ్‌లోని ఓలీని ఎంపిక చేశారు.ఎత్తైన ప్రదేశాల్లో యుద్ధం చేసిన అనుభవం భారత సైన్యం సొంతం. సియాచిన్ వార్‌, కార్గిల్ వార్‌లలో భారత్ పర్వత ప్రాంతాల్లోనే పోరాడి గెలిచింది.అందువల్ల ఎత్తైన ప్రాంతాలలో యుద్ధం చేసిన అనుభవం భారతదేశానికి ఉన్నంతగా.మరే దేశానికి లేదు.

ఈ క్రమంలోనే అమెరికా సైన్యానికి మన ఆర్మీ అనుభవాలను పంచుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube