భారత ఎన్నారైల ఉత్ఖంట... 2 +2 చర్చలపై ఆశలు

అమెరికాలో పలు రంగాలలో స్థిరపడి పోయిన భారత ఎన్నారైల వీసా విధానంపై గత సంవత్సర కాలంగా కొనసాగుతున్న దాగుడు మూతలపై ట్రంప్ అంతరంగానికి తెరపడనుందని ఎప్పటి నుంచో భారత్ అమెరికా మధ్య జరగవలసిన “2 +2 ” చర్చలలో ఈ విషయంపై ఒక క్లారిటీ రానుందని తెలుస్తోంది.2+2 చర్చలు ఎప్పుడో జరగాల్సి ఉండగా అమెరికా వీటిని వాయిదా వేస్తూ వచ్చింది.గతేడాది ప్రధాని నరేంద్రమోదీ వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంగా 2+2 చర్చల్ని ప్రకటించారు.

 India Us 22 Dialogue To Be Held In Delhi On September 6-TeluguStop.com

భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక ,భద్రతా ,రక్షణ సహకారాలను బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు ప్రారంభమయ్యాయి…ఇరుదేశాల మధ్య జరగవలసిన కీలక చర్చలు ప్రారంభించారు.ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ చర్చల్లో భారత రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ సమావేశమయ్యారు.ఇదిలాఉంటే కోట్లాది మంది ఎన్నారైలు ఎదురు చూస్తున్న వీసా విధానాల పై కూడా ఈ చర్చల్లో రానుందని అందుకు గాను ఇరుదేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, మైక్ పాంపెయో ల మధ్య కూడా ద్వైపాక్షిక చర్చలు ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది.

ఇదిలాఉంటే ఇరాన్, రష్యా, అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం భారత్‌పై పడుతున్న నేపథ్యంలో ఈ చర్చలకు మరింతగా ప్రాధాన్యత చేకూరుతోంది.ప్రాధాన్యత పెరిగింది…అయితే జులై మొదటివారంలో వాషింగ్టన్‌లో చర్చలు జరపాలని నిర్ణయించినా… అత్యవసర కారణాలతో వాయిదా వేస్తున్నట్లు అమరికా ప్రకటించింది.దీంతో ఇప్పుడు తాజాగా ఇరుదేశాలు 2+2 చర్చలను ఢిల్లీలో ప్రారంభించారు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube