వాణిజ్యం పెంచడమే లక్ష్యం... భారత్-యూకేల మధ్య ఇవాళ్టీ నుంచి చర్చలు

బిలియన్ పౌండ్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచేందుకు వీలుగా వస్తువులు, ప్రజల స్వేచ్ఛా కదలికలను కోరుతూ భారత్- యూకే మధ్య న్యూఢిల్లీలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై గురువారం నుంచి చర్చలు ప్రారంభం కానున్నాయి.భారత్‌తో ఎఫ్‌టీఏ చర్చలు ప్రారంభమైనట్లు బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.

 India, Uk To Formally Launch Free Trade Agreements In New Delhi Today , British-TeluguStop.com

బ్రిటన్ వ్యాపారాన్ని… భారత ఆర్ధిక వ్యవస్థకు “front of the queue”గా వుంచేందుకు ఇది సువర్ణావకాశంగా ఆయన అభివర్ణించారు.

యూరోపియన్ యూనియన్‌ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన తర్వాత ఇండో – పసిఫిక్ ప్రాంతం చుట్టూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల వైపు ఆ దేశం చూస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఇండియాతో బ్రెగ్జిట్ అనంతర ప్రాధాన్యతలలో ఒకటిగా ఒప్పందం చేసుకుంది.కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, యూకే వాణిజ్య మంత్రి అన్నే మేరీ ట్రవెల్యన్‌లు గురువారం న్యూఢిల్లీలో పలు అంశాలపై భేటీకానున్నారు.

బ్రిటీష్- ఇండియా మధ్య వాణిజ్యానికి సంబంధించి వచ్చే వారంలో మొదటి రౌండ్ చర్చలు ప్రారంభమవుతాయి.

అత్యంత వేగంగా వృద్ధి  చెందుతోన్న భారత ఆర్ధిక వ్యవస్థ ముందు బ్రిటన్ వ్యాపారాలను క్యూలో ముందు వరుసలో వుంచేందుకు ఇండియాతో ఒప్పందం ఒక సువర్ణావకాశమని మేరీ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ఒప్పందం భారతదేశానికి బ్రిటీష్ ఎగుమతులను దాదాపు రెట్టింపు చేయ గలదని ఆమె ఆకాంక్షించారు.2035 నాటికి మొత్తం వాణిజ్యం ఏడాదికి 28 బిలియన్ పౌండ్లకు పెరుగుతుందని బ్రిటన్ పేర్కొంది.బ్రిటీష్ గణాంకాల ప్రకారం 2019లో ఈ వాణిజ్యం విలువ 23 బిలియన్ పౌండ్లు.

తన మాజీ వలస రాజ్యమైన భారత్‌తో ఇటీవల బ్రిటన్ బలమైన వాణిజ్య సంబంధాలను పెంచుకుంటోంది.దశాబ్ధాలుగా కొనసాగుతున్న వలసల కారణంగా యూకేలో భారత ప్రవాసులు కూడా పెరుగుతున్నారు.బ్రిటన్‌లో భారతీయులు నివసించడానికి, పనిచేయడానికి భారత్ అవకాశాలను కోరుతోంది.

భారతీయ విద్యార్ధులు, నిపుణుల కోసం నిబంధనలను సడలించడం, రుసుములు తగ్గించడం వంటివి ఇందులో వున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube